మరి ముఖ్యంగా ఇటీవల కాలంలో టాలీవుడ్ లో బాలీవుడ్ హీరోయిన్ల హవా కొనసాగుతోంది. బాలీవుడ్ నుంచి వచ్చి టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన చాన్సులు దక్కించుకుంటున్నారు ఎంతోమంది. ఇక ఇప్పుడు దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ కూడా టాలీవుడ్ లో అడుగు పెట్టింది. ఎన్టీఆర్ సరసన దేవర మూవీలో నటించింది. ఈ సినిమా ఈనెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే తన మొదటి మూవీనే బ్లాక్బస్టర్ అయ్యేలా కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటికే దేవర మూవీలో జాన్వికపూర్ కు సంబంధించిన లుక్ చూసి ప్రేక్షకులందరూ ఫిదా అయిపోయారు. ఇక సిల్వర్ స్క్రీన్ పై ఆమెను చూసేందుకు రెడీ అవుతున్నారు ఫ్యాన్స్.
అయితే దేవర మూవీ కోసం ఎవరు ఎంత రెమ్యూనరేషన్ అందుకున్నారు అనే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారగా జాన్వికపూర్ కి గట్టిగానే పారితోషకం అందింది అంటూ ఒక టాక్ ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతుంది. బాలీవుడ్ లో జాన్వి కపూర్ ఒక్కో సినిమాకి మూడు నుంచి నాలుగు కోట్లు తీసుకుంటుందట. కానీ దేవర సినిమాకి మాత్రం ఐదు కోట్లు డిమాండ్ చేసిందట. నిర్మాతలు కూడా ఇంత మొత్తంలో ఇచ్చేసారట. సాధారణంగానే బాలీవుడ్ హీరోయిన్లు సౌత్ సినిమాలు చేయడానికి రెగ్యులర్గా తీసుకునే పారితోషికం కంటే కాస్త ఎక్కువగా డిమాండ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ ఎన్నో భాషల్లో విడుదలవుతుంది. కాబట్టి నిర్మాతలు కూడా అడిగినంత ఇచ్చేస్తూ ఉంటారు.