ఏ సినీ ఇండస్ట్రీలో నైనా సరే ఎఫైర్ రూమర్స్ పెద్ద ఎత్తున సెలబ్రిటీల మీద వినిపిస్తూ ఉంటాయి.. సౌత్ ఇండస్ట్రీలో పోలిస్తే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇవి ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయని చెప్పవచ్చు. ఇప్పుడున్న హీరో, హీరోయిన్స్ అందరూ కూడా ఒకరితో రిలేషన్ మరొకరితో వివాహం అన్నట్టుగా మారిపోయింది. అయితే ఇప్పుడు ఒక హీరోయిన్ని ఇద్దరు హీరోలు గాఢంగా ప్రేమించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒక హీరో ఆ హీరోయిన్ ని ప్రేమించడం వల్ల కెరియర్ నాశనం చేసుకున్నట్లుగా సమాచారం. మరి వారి గురించి తెలుసుకుందాం.
అందులో ఒక ఈ హీరో ఎవరో కాదు వివేక్ ఒబెరాయ్. బాలీవుడ్ మంచి క్రేజీ ఉన్న హీరో. ఈయన తండ్రి కూడా సురేష్ ఒబెరాయ్ బిజినెస్ మ్యాన్ కావడం చేత తన కుమారుడు వివేక్ ఒబెరాయ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అలా తక్కువ సమయంలోనే స్టార్ పోసిషన్ లో చేరారు.అయితే అప్పుడప్పుడే ఐశ్వర్యరాయ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో ప్రేమలో పడ్డారట. వీరిద్దరూ కలిసి చాలా కాలం పాటు వెయిటింగ్ చేశారని కొన్నేళ్లపాటు రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఉండేవారని బాలీవుడ్లో కథలుగా వినిపించాయి.
అయితే అటువంటి సమయంలోనే హీరో సల్మాన్ ఖాన్ సైతం ఐశ్వర్యారాయ్ తో క్లోజ్ గా ఉండేవారు. ఈ విషయం తెలిసిన వివేక్ ఒబేరాయ్ డైరెక్ట్ గానే సల్మాన్ ఖాన్ పైన విమర్శలు చేసేవారట. ఈ విషయంలో ఈ ఇద్దరు హీరోలు కూడా బెదిరించుకున్నట్లు సమాచారం. ఈ విషయం ఐశ్వర్యరాయ్ కి తెలియడంతో చివరికి వివేక్ ఒబెరాయ్ కి బ్రేకప్ చెప్పిందట. ఆ తర్వాత కొన్నేళ్లపాటు సల్మాన్ ఖాన్ తో రిలేషన్ మైంటైన్ చేసిన ఐశ్వర్యారాయ్.. ఆ తర్వాత కొన్నేళ్ళకి అతడికి కూడా బ్రేకప్ చెప్పి చివరికి అభిషేక్ బచ్చన్ నీ ప్రేమించి వివాహం చేసుకుంది. ఆ తర్వాత వివేక్ ఒబెరాయ్ కూడా వివాహం చేసుకోగా.. సల్మాన్ ఖాన్ ఇప్పటికీ సింగల్ గానే తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో చూడాలి మరి.