ఒకవేళ ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తే చేస్తారా అని ప్రశ్నించగా.. కచ్చితంగా చేస్తానని ఆలి వివరణ ఇచ్చారు. 2019 ఎన్నికల ముందు జనసేన పార్టీని కాదని ఆలీ వైసీపీ పార్టీలోకి చేరడంతో ఒకరి పైన మరొకరు చాలా విమర్శలు కూడా చేశారు. వైసిపి పార్టీ ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా కమెడియన్ ఆలీ పైన చాలా దారుణంగానే విమర్శలు చేయడం జరిగింది. ఏపీ డిప్యూటీ సీఎం గతంలో ఆలీ కూడా తనని మోసం చేశాడనే విధంగా విమర్శించారు. అన్నిటికీ కూడా ఆలీ గట్టిగానే కౌంటర్ ఇవ్వడం జరిగింది.
2024 ఎన్నికలలో భాగంగా వైసిపి పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని కమెడియన్ ఆలీ భావించగా సీటు విషయంలో దక్కించుకోలేకపోయారు. వీటికి తోడు ఎన్నికలలో పార్టీ కూడా చాలా ఘోరంగా ఓడిపోవడంతో వైసిపి పార్టీ నుంచి కమెడియన్ ఆలీ రాజీనామా చేసి బయటికి వచ్చారు.వైసిపి పార్టీ నుంచి బయటికి వచ్చిన ఆలీ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కి మద్దతుగా కామెంట్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో పొలిటికల్ పరంగా ఏమైనా మళ్ళీ తిరిగి ఎంట్రీ ఇస్తారా లేకపోతే పొలిటికల్స్ కి గుడ్ బై చెప్పి కేవలం సినిమాలలో మాత్రమే నటిస్తారేమో చూడాలి..