ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే భారీ హైప్స్ ఉంటాయి.. ముఖ్యంగా ఓటీటీ రైట్స్, థియేట్రికల్ బిజినెస్ విషయంలో కూడా ఒక లెక్క ఉంటుంది. కానీ ప్రస్తుతం విశ్వంభర సినిమాకి చూస్తే అలా ఏమి కనిపించడం లేదట. విశ్వంభర ఓటీటి రైట్స్ విషయంలో అందరూ ఆశ్చర్యపోయేలా అనౌన్స్మెంట్ వినిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఒక ప్రముఖ సంస్థ విశ్వంభర సినిమా ఓటీటి హక్కులను తీసుకోవాలని సజెషన్ చేయగా.. చిత్ర బృందం సుమారుగా 80 కోట్లకు పైగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నప్పటికీ కానీ ఆ ఓటీటి సంస్థ మాత్రం కేవలం 30 కోట్లు అయితే ఓకే అని చెబుతోందట.
దీంతో మేకర్స్ ఊహించని దాని కంటే మరింత దారుణంగా ఆ ఓటిటి సమస్త అడగడంతో మేకర్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. మెగాస్టార్ సినిమా అంటే మరి ఇంత దారుణంగా ఉన్నాయా అంటూ ఆశ్చర్యపోతున్నారు. గతంలో ఉన్నట్టుగా ప్రస్తుతం ఓటీటీ రైట్స్ అంచనాలు అన్ని సినిమాలకు తప్పుతున్నాయి అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి విశ్వంభర సినిమా మెగాస్టార్ క్రేజ్ వల్ల ఆడుతుందని అందరూ భావిస్తున్నారు. కానీ చిరంజీవి క్రేజ్ తగ్గిపోతోందనే విధంగా ఈ ఓటిటి డీల్ ని చూస్తే ఇప్పుడు అర్థమవుతోంది. ఇందులో ఎంత నిజం ఉందో చూడాలి. మరి ఏ ఓటిటి సంస్థ అధిక ధరకు కొనుగోలు చేస్తుందో చూడాలి.