రేపటి రోజున జానీ మాస్టర్ ని కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారట. ముఖ్యంగా బాధితురాలు ఇలా తెలియజేస్తూ ఒక డాన్స్ షోలో ఇద్దరికీ పరిచయం ఏర్పడిందని.. ఆ షోలో పార్టిసిపేషన్ చేస్తున్న సమయంలో ఏర్పడిన పరిచయం వల్ల 2019లో తనకి కాల్ చేసి గ్రూపులో చేర్చుకుంటానని చెప్పారని.. ఆ తర్వాత ముంబై తో సహా ఇతర నగరాలలో అవుట్ డోర్ షూటింగ్ ఉన్నప్పుడు జానీ మాస్టర్ ఎన్నోసార్లు లైంగికంగా వేదించారు అంటూ లేడీ కొరియోగ్రాఫర్ కంప్లైంట్ ఇచ్చింది.
చాలాసార్లు ప్రతిఘటిస్తే కొట్టే వారిని హింసించే వారిని మతం మార్చుకొని వివాహం చేసుకోవాలని తన మీద ఒత్తిడి తెచ్చారని లేకపోతే ఇండస్ట్రీలో లేకుండా చేస్తానంటూ బెదిరించే వారిని తెలియజేసింది. అలాగే ఎన్నోసార్లు అందరి ముందు టచ్ చేసే వారిని.. కొన్నిసార్లు జానీ మాస్టర్ తన భార్య అయేషాతో కలిసి బెదిరించారని కొట్టారని ఆరోపించింది ఆ లేడీ కొరియోగ్రాఫర్.. దీంతో తన దగ్గర ఉద్యోగం మానేసినప్పటికీ కూడా తన ఇంటికి వచ్చి మరి జానీ మాస్టర్ తన భార్య గొడవ పెట్టుకునే వారని మతం మారాలంటూ హింసించే వారిని ఎఫ్ఐఆర్లో వెల్లడించింది. దీంతో జానీ మాస్టర్ ని అరెస్టు చేసిన నేపథ్యంలో అతని భార్య ఆయేషా స్టేషన్ వద్ద మీడియాతో చాలా అతిగా ప్రవర్తించిందట. అక్కడున్న వారందరితో కూడా చాలా దురుసుగానే మాట్లాడుతూ రచ్చ చేసిందట ఆయేషా.. తన భర్త పై కేసుకు సంబంధించి విషయాలను అడగగా అందరి పైన కేసు పెడతానంటూ బెదిరిస్తోందట.