అయితే జానీ మాస్టర్ లేడీ కొరియోగ్రాఫర్ ని కొన్ని సంవత్సరాల నుంచి వేధిస్తున్నారని.. లైంగిక దాడి చేసిన సమయంలో ఈమె మైనర్ కావడం చేత ఫోక్సో కేసు కూడా జానీ మాస్టర్ పైన పెట్టారు. రేపటి రోజున జానీ మాస్టర్ ని కోర్టులో ప్రవేశపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సమయంలోనే జానీ మాస్టర్ ఈ లేడీ కొరియోగ్రాఫర్ తో ప్రవర్తించినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఇక ఈ వీడియో విషయానికి వస్తే.. ఏవో ఫోటోలకు స్టిల్స్ ఇస్తూ శేఖర్ మాస్టర్ ఆమె ముందు ఏదో ఫోజు కొడుతూ ఉన్నట్టుగా కనిపిస్తోంది.. జానీ మాస్టర్ ఆ కొరియోగ్రాఫర్ కి దగ్గరకి ఆనుకుంటూ మరి వెళుతూ ఫోటోలకు స్టిల్స్ ఇస్తున్నారు. అమ్మాయి చేయి గట్టిగా పట్టుకొని నలుపుతూ ఉండడమే కాకుండా.. ఆమె భుజం పైన చెయ్యి వేస్తూ ఉన్నప్పుడు ఆమె ముఖంలో ఏదో తెలియని ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్ కనిపించినట్లుగా ఈ వీడియోలో కనిపిస్తోంది. కేవలం అక్కడ ఫోటోలకు మాత్రమే ఆమె నవ్వుతూ ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇవే కాకుండా జానీ మాస్టర్ గురించి చాలా విషయాలు వైరల్ గా మారుతున్నాయి. తన భార్యతో కలిసి ఎక్కువగా టార్చర్ చేశారని మతం మారాలి అంటూ పెళ్లి చేసుకోవాలంటూ వేధించేవారు అని ఆ కొరియోగ్రాఫర్ తెలిపింది.