అలాంటిది ఏకంగా సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ గా కొనసాగుతున్న వారి పిల్లలకు ఇలాంటి వినయం ఉంటుందా అంటే చాలా తక్కువగానే చూస్తూ ఉంటాం అని చెప్పాలి. అది కూడా ఏకంగా అమితాబచ్చన్ ఫ్యామిలీ అంటే ఇక ఆ రేంజ్ మరో లెవెల్ లో ఉంటుంది. కానీ ఇలా అమితాబచ్చన్ ఫ్యామిలీకి చెందినప్పటికీ ఎంతో వినయాన్ని కనబరిచింది ఐశ్వర్యరాయ్ కూతురు. ఇక ఇటీవల ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.
ఇటీవల సైమ అవార్డ్స్ లో భాగంగా పోనియన్ సెల్వన్ చిత్రంలో నటనకు గాను క్రిటిక్స్ ఛాయిస్ లో ఉత్తమ నటి అవార్డును అందుకుంది ఐశ్వర్యరాయ్. ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ తో కలిసి ఐశ్వర్య ఇలా అవార్డును అందుకున్నారు. అయితే ఇలా అవార్డును అందుకొని స్టేజ్ కిందికి వచ్చిన సమయంలో ఇక వెంటనే అక్కడ ఉన్న ఐశ్వర్యరాయ్ కూతురు ఆరాధ్య బచ్చన్ తల్లిని వచ్చి ఆలింగణం చేసుకుంటుంది. ఇక ఆ తర్వాత అక్కడే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఐశ్వర్యను పలకరించగా.. ఆ తర్వాత ఆరాధ్యనికి కూడా పలకరిస్తాడు. దీంతో ముందుగా శివన్నకు నమస్కారం చేసిన ఆరాధ్య.. తర్వాత ఆయన పాదాలకు మొక్కి ఆశీస్సులు తీసుకుంటుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారగా.. అటు ఆరాధ్య బచ్చన్ పెద్దల పట్ల వినయంగా ఉండడం చూసి విధా అవుతున్నారు నేటిజన్స్.