ఆ క్రేజ్ తో ఇప్పుడు బిగ్బాస్ కంటెస్టెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదట్లో నిఖిల్ తో చాలా చనువుగా ఉన్న ఈమె వీరిద్దరి మధ్య లవ్ నడుస్తోందని హౌస్ లో కూడా వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు తాజాగా తన లవ్ స్టోరీని సోనియా బట్టబయలు చేస్తూ ..తనకు బయట లవర్ ఉన్నారనే విషయం పైన క్లారిటీ ఇచ్చేసింది. నిన్నటి రోజున జరిగిన ఒక ఎపిసోడ్లో సోనియా ప్రేరణతో సైతం ఇలా డిస్కర్షన్ చేసింది. తనకు బయట లవర్ ఉన్నారని తాను ఎప్పుడూ ఆయనకు ప్రపోజ్ చేయలేదు కానీ రెండున్నరలుగా తమ ఇద్దరం కలిసి పని చేస్తున్నామంటూ తెలిపింది సోనియా.
తాను మొదలుపెట్టిన ఎన్జీవో కి వెబ్సైట్ డిజైనింగ్ కూడా తనే చేశారని స్పాన్సర్లను కూడా ఆయనే తీసుకువచ్చారని తెలిపింది.. దీంతో ప్రేరణ ఇంకేమి వివాహం చేసుకోవచ్చుగా అంటూ చెప్పగా.. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఇచ్చింది సోనియా.. ఆయనకు వేరే అమ్మాయితో రిలేషన్ ఉండేవారు.. కానీ ఇప్పుడు కాదు.. విడిపోయారు అయితే తన లైఫ్ లోకి వచ్చిన తర్వాత చాలా మార్పులు వచ్చాయి అంటూ తెలిపింది సోనియా. తన గోల్స్ కి ఇబ్బంది అవుతుందని కుటుంబం నుంచి తాను దూరంగా ఉన్నానని కానీ తను వచ్చాకే తన జీవితం మారిపోయింది అంటూ సోనియా వెల్లడించింది. అయితే వేరే అమ్మాయితో ఉన్నాడని చెప్పావు కదా మరి దాని పరిస్థితి ఏంటి అంటూ ప్రేరణ అడగగా.. దగ్గరికి వచ్చి ఆ అమ్మాయితో ఆయనకి డైవర్స్ అయ్యాయి అంటూ చెప్పింది సోనియా. అందుకే తన నిర్ణయం కోసమే అతను వెయిట్ చేస్తున్నాడు అంటూ తెలిపింది సోనియా.