అయితే ఈ చిత్రానికి సంగీత దర్శకుడు థమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించారు డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో ఈ సినిమాని డైరెక్టర్ అశోక్ అద్భుతంగా తెరకెక్కించారు. బాహుబలి 1,2 శిరీష తర్వాత అనుష్క నెమ్మదిగా సినిమా కథలలో నటిస్తూ ఉన్నది. కానీ అనుష్క రేంజ్ కు తగ్గట్టుగా సినిమాలు పడకపోవడంతో ఆమె మార్కెట్ కూడా డౌన్ అయ్యిందనే విధంగా వార్తలు వినిపించాయి. గత ఏడాది మాత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే చిత్రంతో పరవాలేదు అనిపించుకుంది. ప్రస్తుతం డైరెక్టర్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తోందట.
ఇలాంటి సమయంలోనే అనుష్క తాజాగా మరొక ప్రాజెక్టుకి సైన్ చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. భాగమతి సీక్వెల్ లో అనుష్క నటించే విధంగా ఓకే చెప్పిందట. ఇప్పటికే ఇందుకు సంబంధించి డైరెక్టర్ అశోక్ కూడా ఒక ఇంట్రెస్టింగ్ కథను కూడా అనుష్కకు వినిపించారని సమాచారం. అనుష్కకు కూడా కథ నచ్చడంతో ఓకే చెప్పేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో ఈ చిత్రానికి సంబంధించి అఫీషియల్ గా కూడా అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన అభిమానుల తెగ సంబరపడుతున్నారు.. ఇప్పటివరకు అనుష్కకు సంబంధించి ఎలాంటి సినిమాల న్యూస్ రాకపోవడంతో కాస్త నిరాశలో ఉన్నారు. భాగమతి వంటి సినిమాతో అనుష్క ప్రేక్షకుల ముందుకు వస్తే కలెక్షన్స్ తో దుమ్ము దులిపేస్తుందని అభిమానులు భావిస్తున్నారు. మరి ఇందులో ఎంత వాస్తవము ఉందో చూడాలి.