గుడ్ల టాస్క్ లో భాగంగా అటు విష్ణుప్రియ, ప్రేరణ మధ్య తీవ్రమైన ఫైట్ నెలకొంది.. దీంతో ఒకరినొకరు క్యారెక్టర్ లెస్ అనే రేంజ్ లో తిట్టుకోవడం జరిగింది. మరొకపక్క తమకు బయట రిలేషన్ లో ఉన్నామని హౌస్ లో మాత్రం ప్రేమ పక్షుల్లో మారిపోతామంటూ సోనియా, నిఖిల్ ఇద్దరు కూడా చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నారు. వీరితో పాటు సోనియా ,పృథ్వి అనే మరో కంటెస్టెంట్ తో కూడా క్లోజ్ గానే మూవ్ అవుతోంది. అవసరమైనప్పుడల్లా వీరి ముగ్గురు హగ్గులు ఇతరత్రా వాటిని కానిచ్చేస్తున్నారు.
మరొక కంటెస్టెంట్ సింపతితో గేమ్ మొదలు పెట్టిన మణికంఠ, సోనియా హగ్గులకు అలవాటు పడిపోయారు.. అక్క అంటూ కెమెరాలు లేని చోటుకు వెళ్లి మరి హగ్ చేసుకోవాలని అడుగుతూ ఆమెను ఎన్నోసార్లు టైట్ హగ్స్ చేసుకుంటూ ఉన్నారు. ఈ సీజన్ నాగార్జున లిమిట్లెస్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పినప్పటికీ కానీ ఈ హక్కులతోనే ఆడియన్స్ ని విసిగించేస్తున్నారు. బిగ్బాస్ యాంటీ ఫ్యాన్స్ సైతం ఈ విషయాల పైన ఫైర్ అవుతూ ఇది బిగ్ బాస్ కాదు కామ బాస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఒకరినొకరు తిట్టుకోవడమే కాకుండా ఈ హక్కుల గొడవ ఏంటో.. ఒకరినొకరు చేతులు పట్టుకొని మరి నాన హంగామా చేస్తూ ఉంటే వీటిని చూసిన ఆడియన్స్ బిగ్ బాస్ ఈ రోత ఏంటి అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు.