ఇప్పుడు ఆ విషయం అప్రస్తుతం గానీ, బాలయ్య సందర్భం వచ్చినప్పుడల్లా ఏఎన్ఆర్ పై తన అభిమానాన్ని ప్రకటించుకుంటూనే ఉంటాడు. బాలయ్య సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక పోస్ట్ దానికి ఒక మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నాగేశ్వరరావు గారు శత జయంతి సందర్భంగా బాలయ్య సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారుతుంది.
ఆయన ఈ సందర్భంగా పోస్ట్ చేస్తూ... "తెలుగు సినిమా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన అక్కినేని నాగేశ్వరరావు గారి శతజయంతి సందర్భంగా ఆయనను స్మరించుకోవడం గర్వకారణం. మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన పాత్రలు, తెలుగు సినిమాకు ఆయన చేసిన అమూల్యమైన సేవలు చిరస్మరణీయాలు. ఆయన కృషి, కీర్తి, మరియు స్ఫూర్తి ప్రతి నటునికి మార్గదర్శకం. ఈ శతజయంతి సందర్భంగా, తెలుగు సినీరంగానికి ఆయన అందించిన అపారమైన సేవలకు మనమందరం శిరసు వంచి కృతజ్ఞతలు తెలుపుదాం. నాటకరంగం నుండి చిత్రరంగం వరకు, ఆయన చేసిన ప్రయాణం ప్రతి ఒక్కరికి ప్రేరణ. ఈ రోజు, ఆయనకు మనమందరం నివాళి అర్పిస్తూ, ఆయన నటన, కృషి, మరియు పట్టుదలతో వెలసిన విజయాలను స్మరించుకుందాం." అనే ఒక పెద్ద పోస్టు పెట్టారు. దీనిని చూసిన అభిమానులు దీనిని వైరల్ చేస్తున్నారు. మరోవైపు ఈ పోస్ట్ చూసిన నందమూరి అభిమానులు... బాలయ్య బాబు తోపు.. నిష్కల్మషంగా ఎదుటివారిని విష్ చేయాలంటే అది మా బాలయ్య వలనే అవుతుందని కామెంట్లు చేస్తున్నారు.