హీరో సిద్ధార్థ్ - హీరోయిన్ జెనీలియా కలిసి నటించిన బొమ్మరిల్లు అనే సినిమా గురించి ప్రేక్షకులకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా రిలీజ్ అయ్యి దాదాపు రెండు దశాబ్దాలు కావస్తోంది. అయినా ఈ సినిమాకి ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా నేడు కూడా బుల్లితెర పైన తనదైన సత్తా చాటుతోంది. దానికి కారణం ఆ సినిమాలోని కంటెంట్ అని వేరే చెప్పాల్సిన పని లేదు. ఈ ఒక్క సినిమాతోనే హీరో సిద్ధార్థ్ మంచి నటుడు అని అనిపించుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత గత 18 ఏళ్లలో సిద్ధార్థ కు సరైన హిట్ పడలేదని చెప్పుకోవాలి.
ఇక అసలు విషయంలోకి వెళితే... ప్రస్తుతం తెలుగు నాట సినిమాల రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతుండడంతో, త్వరలో ప్రేక్షకుల ముందుకి బొమ్మరిల్లు సినిమా రాబోతున్నట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే హీరో సిద్ధార్థ స్పందిస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ సినిమా తనకెంతో స్పెషల్ అని మాట్లాడుతూ... ఈ సినిమా తర్వాత తన ఇంటి పేరు కూడా బొమ్మరిల్లు గా మారిపోయింది అని చెప్పుకొచ్చాడు.
ఇకపోతే ఈ సినిమా సెప్టెంబర్ 21న థియేటర్లలోకి ఫ్యామిలీ ఆడియన్స్ను ఆకట్టుకోవడం కోసం మరల రాబోతోంది. ఈ క్రమంలోనే బుక్ మై షో లో టికెట్స్ పెట్టడం జరిగింది. హీరో సిద్ధార్థ్ అభిమానులకు ఈ సందర్భంగా ఓ శుభవార్త ఏమిటంటే, ఈ సినిమా దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి మన హీరో సిద్ధంగా ఉన్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు నిజమైతే... బొమ్మరిల్లును ఢీకొనే సినిమా మరొకటి రాబోతున్నట్టు మనం ఆశించవచ్చును. ఏది ఏమైనను, ఈ సినిమా విడుదల తర్వాత 18 ఏళ్లు గడిచిపోయాయి. గడిచిన 18 సంవత్సరాలలో టాలెంటెడ్ హీరో సిద్ధార్థకు ఒక్క హిట్ అంటే ఒక్క హిట్టు కూడా పడకపోవడం ఒకంత బాధకరం.