అయితే ప్రతి బిగ్ బాస్ సీజన్ లో వైల్డ్ కార్డు ఎంట్రీస్ ని పెట్టి అటు ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేకెత్తించాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తూ ఉంటారు. అయితే ప్రతి సీజన్లో ఒకటి లేదా రెండు వైల్డ్ కార్డు ఎంట్రీలు మాత్రమే ఉండటం చూస్తూ ఉంటాం. కానీ ఈసారి మాత్రం బిగ్ బాస్ హౌస్ లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 వైల్డ్ కార్డు ఎంట్రీస్ ఉంటాయి అంటూ బిగ్ బాస్ చెప్పాడు. దీంతో అందరూ షాక్ అయ్యారు. అయితే ఇలా వైల్డ్ కార్డు ద్వారా ఎంతమంది ఎంట్రీ ఇవ్వాలి అనే విషయాన్ని హౌస్మెట్స్ నిర్ణయించేందుకు అవకాశం ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ పెట్టిన టాస్కుల్లో ఏదో ఒక టీమ్ విజేతలుగా నిలిస్తే.. ఇక ఒక్కో వైల్డ్ కార్డు ఎంట్రీ ఆపేందుకు అవకాశం ఉంటుంది.
ఇక దీనికి సంబంధించిన టాస్క్ లను నిర్వహిస్తూ వస్తున్నారు అని చెప్పాలి. అయితే ఇక మొదటి వైల్డ్ కార్డు ఎంట్రీ ఎవరిది ఉండబోతుందా అని చర్చ జరుగుతున్న సమయంలో బిగ్బాస్ నిర్వాహకులు అందరిలో ఉత్కంఠను పెంచేందుకు ఆ కంటెస్టెంట్ యొక్క షాడో ఫోటోని రిలీజ్ చేశారు. ఈ క్రమంలోనే అతను ఎవరో చెప్పకుండా కన్ఫ్యూజన్లో పెట్టేసారు. కానీ ఆ షాడో ఎవరిదో ప్రేక్షకులు చెప్పేస్తున్నారు. గత సీజన్లో పాల్గొని తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించిన టేస్టీ తేజ మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వబోతున్నాడని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఆ షాడో ఫోటో అతనిదే అని కామెంట్లు చేస్తున్నారు. అయితే టేస్టీ తేజ తో పాటు యాంకర్ రవి, ముక్కు అవినాష్, నయని పావని, హరితేజ రోహిణి ఇలా పలువురు పేర్లు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా రాబోతున్నారంటూ వినిపిస్తున్నాయి.