అయితే బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేషన్ జరిగిన ప్రతిసారి కూడా ఇలా హౌస్ నుంచి బయటికి వచ్చిన కంటెస్టెంట్స్ హౌస్ లో జరుగుతున్న విషయాలపై ఎలాంటి నిజాలను బయటపెడతారు అనే విషయం హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. కాగా కొంతమంది హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా సైలెంట్ గానే ఉంటే.. ఇంకొంతమంది మాత్రం హౌస్ లో జరిగిన విషయాలపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు నాలుగో వారంలో బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన సోనియా కూడా ఇదే చేస్తుంది. బయటికి వచ్చిన తర్వాత వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ.. బిగ్ బాస్ తనను తప్పుగా చూపించాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తుంది.
హౌస్ లో ఉన్నప్పుడు నేను అన్ని పనులు చేశా. కానీ మీకు చూపించింది పృథ్వి నిఖిల్ తో ఉన్నది మాత్రమే. పోనీ చూపించింది పూర్తిగా చూపించకుండా అంతా కట్ చేసి ప్రేక్షకులకు నన్ను బరితెగించిన అమ్మాయిలా చూపించారు. అక్కడ జరిగింది వేరు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పృథ్వి నిఖిల్ను వాడుకుంటున్నట్లు చూపించారు. నేను ఎప్పుడూ ఆమె స్థాయికి దిగజారలేదు. నా హగ్గులు చేతులు వేయడాన్ని చూపించడానికి.. ముందు వెనక తీసేసి వాళ్లకి ఏం కావాలో అదే చూపించుకున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇక పృథ్వి నన్ను హగ్ చేసుకుని కిస్ చేసేది కూడా తప్పుగా చూపించారు. హౌస్ లో ఉన్నంత సేపు నన్నే ఫోకస్ చేశారు. ఒక మాటలో చెప్పాలంటే బిగ్ బాస్ కు బుద్ధిలేని పనులు చేసి చూపించారు. అందరికీ ఎఫైర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటికి వస్తాయి అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది సోనియా. ఇలా వరుస ఇంటర్వ్యూలలో బిగ్ బాస్ పై సోనియా విమర్శలు చేస్తున్న తీరు హాట్ టాపిక్ గా మారిపోయింది.