కేవలం సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ సూపర్ సక్సెస్ అయి తనకు తిరుగులేదు అని నిరూపించారు. పార్టీని స్థాపించిన కేవలం 9 నెలల వ్యవధిలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టి ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కారు. ఇలా ఒక రైతు కుటుంబంలో పుట్టి కృషి పట్టుదలతో అనేక మైళ్ళు రాళ్లను అధిగమించారు సీనియర్ ఎన్టీఆర్. అయితే ఆయన జీవనశైలి కూడా మిగతా వాళ్లతో పోల్చి చూస్తే ఎంతో భిన్నంగా ఉండేది. ఇక ఇలాంటి జీవనశైలిలో ఒక అలవాటును కొడుకు కోసం వదిలేసారట సీనియర్ ఎన్టీఆర్.
ఉదయం లేవగానే ఎన్టీఆర్ కుచుట్ట తాగే అలవాటు ఉందట. ఇది ఆయన దినచర్యలో భాగంగా ఉండేదట. అయితే ఇక ఎన్టీఆర్ కొడుకు హరికృష్ణకు కూడా స్మోకింగ్ అలవాటు ఉందట. సిగరెట్స్ ఎక్కువ తాగేవారట. కానీ ఎన్టీఆర్కు ఈ విషయం తెలిసి ఇక కొన్నిసార్లు మందలించారు. అయితే ఇలా హరికృష్ణను ఎన్టీఆర్ మందలించడం మరో కొడుకు జయశంకర్ కృష్ణకు నచ్చలేదట. తండ్రి చుట్ట తాగుతూ అన్నయ్య సిగరెట్ తాగితే వద్దని చెప్పడమేంటి అనుకున్నాడు. ఒకరోజు ఎన్టీఆర్ తో ఇదే విషయం చెప్పాడట.
మీరు చుట్టూ తాగుతూ హరి అన్నను సిగరెట్ మానేయమనడం అనడం సరికాదు అని ఎన్టీఆర్ తో అన్నాడట. అయితే జయశంకర్ కృష్ణ చెప్పిన ఈ మాట ఎన్టీఆర్ను కదిలించిందట. ఇది కూడా నిజమే కదా అని అప్పటి నుంచి చుట్ట తాగే అలవాటును వదులుకున్నారట. అయితే ఇక ఇలా చుట్ట తాగే అలవాటును ఇప్పుడు ఎన్టీఆర్ కొడుకు నందమూరి బాలకృష్ణ కొనసాగిస్తున్నారట. ఈ విషయాన్ని ఎన్నోసార్లు బాలకృష్ణ ఇంటర్వ్యూలలో కూడా చెప్పుకొచ్చారు. లేచిన వెంటనే చుట్ట తాగుతానని.. తన తండ్రికి ఉన్న అలవాటు తనకు కూడా వచ్చేసింది అంటూ బాలకృష్ణ చెప్పుకొచ్చారు.