ఆత్మలింగం కాన్సెప్ట్ తో హై క్వాలిటీ విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో మాత్రం ఫెయిల్ అయిందనే చెప్పాలి. ఈ సినిమాలో చిరంజీవి ఒకే తరహా క్యాస్టూమ్ లో నటించారు. ఈ సినిమాలో టీనూ ఆనంద్ విలన్ గా నటించారు. రిలీజ్ డేట్లను మార్చుకుని ఆలస్యంగా విడుదల కావడం ఈ సినిమాకు మైనస్ అయింది. ఈ సినిమాలో నమ్రత పర్ఫామెన్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేదనే చెప్పాలి.
స్వప్న అనే పాత్రలో నమ్రత నటించగా ఆ పాత్రకు సంబంధించిన సీన్లు కూడా సినిమాలో ఆసక్తికరంగా లేవని చెప్పవచ్చు. అంజి సినిమా అప్పుడు ఫ్లాపైనా ఇప్పుడు ఈ సినిమాను యూట్యూబ్ లో చూసిన ప్రేక్షకులు మాత్రం ఈ సినిమా విజువల్ వండర్ అని కామెంట్లు చేస్తున్నారు. అంజి సినిమా ఫ్లాప్ గా నిలిచినా చిరంజీవి విశ్వంభర సినిమాతో సత్తా చాటాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
విశ్వంభర సినిమా కథ, కథనం కొత్తగా ఉంటాయని మల్లిడి వశిష్ట ఈ సినిమాతో కచ్చితంగా సక్సెస్ సాధించే ఛాన్స్ ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. విశ్వంభర టాలీవుడ్ రేంజ్ ను పెంచే సినిమాలలో ఒకటిగా నిలవాలని కామెంట్లు వినిపిస్తున్నాయి. విశ్వంభర సినిమా కోసం డబ్బును మంచి నీళ్లలా ఖర్చు చేస్తున్నారని సమాచారం అందుతోంది. విశ్వంభర సినిమాలో ట్విస్టులు ఆసక్తికరంగా ఉండనున్నాయని తెలుస్తోంది. విశ్వంభర రిలీజ్ డేట్ ప్రకటన కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.