కథలోకి వెళ్తే.. హీరోయిన్ కి పలు సందర్భాలలో ఒక చిన్న బాలుడు కనిపిస్తూ ఉంటాడు. వెంటనే అదృశ్యం అవుతాడు. అసలు ఎందుకు ఇలా జరుగుతుందో ఆ హీరోయిన్ కి ఏమీ అర్థం కాదు. ఇక ఒక బేబీ.. సిట్టర్ గా పనిచేస్తున్న హీరోయిన్ కి ఓ భయంకరమైన డ్రీమ్ వస్తుంది. అప్పటి నుంచే ఒక బాలుడు ఆమెకు అద్దంలో కనిపిస్తూ భయపెడుతూ ఉంటాడు. దీనికి తోడు హీరోయిన్ కి ఒకరోజు ఒక పురుగు కుడుతుంది. దాంతో ఆమె కళ్ళు కూడా రంగు మారుతాయి. డాక్టర్ దగ్గరికి వెళ్తే ట్విన్స్ కి మాత్రమే ఇలా జరుగుతుంది అని చెబుతాడు. ఇక దీంతో తాను ఎవరో? తన జీవితం ఏంటో? తెలుసుకోవాలని హీరోయిన్ ప్రయత్నిస్తూ ఉంటుంది. అప్పుడే తనకు ఒక తమ్ముడు ఉండేవాడని పుట్టినప్పుడే అతడు చనిపోయాడని, ఆ కారణాలవల్లే తన తల్లి కూడా మానసికంగా బాధపడుతూ ఆత్మహత్య చేసుకుంది అని ఆమె తండ్రి ఆమెకు వివరిస్తాడు.
నిజం తెలుసుకున్న ఆ హీరోయిన్ చివరికి తన తమ్ముడే తన చుట్టూ తిరుగుతున్నాడనే అనుమానం పడుతుంది. ఆ సమస్య నుంచి ఆమె బయటపడిందా.? ఆమె తల్లి నిజంగానే ఆత్మహత్య చేసుకుందా? లేక హత్య చేశారా? ఒకవేళ హత్య చేస్తే ఎవరు చేశారు..? ఇలా క్షణక్షణం ఉత్కంఠభరితంగా సాగే ఈ కథ అందరిని ఆకట్టుకుంటుంది. దీని పేరు ది అన్ బార్న్. ఎప్పటికప్పుడు ట్విస్ట్ లతో కూడిన ఉత్కంఠ భరితమైన భయాన్ని కలిగించే సన్నివేశాలు చూడాలనుకునే వారికి ఈ సినిమా మంచి ఎక్స్పీరియన్స్ ను ఇస్తుంది. అయితే ఇలాంటి చిత్రాలు ఒంటరిగా మాత్రం చూడకండి. ఇక ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఒంటరిగా చూడకండి.. ఒకవేళ చూసారో మీ ప్యాంట్ తడవడం ఖాయం అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.