టాలీవుడ్ సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తోంది హీరోయిన్ నభా నటేష్. సినిమాలైతే చేస్తోందని కానీ, సరైన హిట్ కోసం తహతహలాడుతోంది.టాలీవుడ్‌లో ఒక్కసారి క్లిక్ అయితే ఆఫర్లకు కొదవ ఉండదని భావిస్తోంది. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోంది. మూడు పదుల వయసుకు దగ్గరపడుతోంది కన్నడ బ్యూటీ నభా నటేష్.సుధీర్ బాబు నటించిన 'నన్ను దోచుకుందువటే' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇస్మార్ట్ శంకర్ లో తన అందం తో,ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో మంచి పేరే దక్కించుకుంది. ఇదిలావుండగా రవిబాబు రూపొందించిన 'అదుగో' చిత్రంతో ప్రేక్షకులను మరోసారి పలకరించింది.ఈమెకి రవితేజ సినిమాలో ఛాన్స్ వచ్చిందని అంటున్నారు. అలానే తెలుగులో కొన్ని సినిమాల కోసం నభా పేరుని పరిశీలిస్తున్నారట. సినిమాల్లో తన పాత్ర కోసం ఏదైనా చేస్తానని అంటోంది ఈ బ్యూటీ. కన్నడలో ఓ సినిమా కోసం గుర్రపు స్వారీ నేర్చుకుందట. అలానే బీడీ తాగడం కూడా నేర్చుకుందట.

ఈ విషయాన్ని నభా స్వయంగా చెప్పుకొచ్చింది.కన్నడలో శివ రాజ్‌కుమార్‌ పక్కన వజ్రకాయలో అవకాశం వచ్చింది. ఆ షూటింగ్‌కు మూడు నెలల పాటు ట్రైనింగ్‌ తీసుకున్నాను. ఓ పల్లెటూరి అమ్మాయిలా అందులో కనిపించాను. ఈ సినిమా కోసం వచ్చిన చాలా అవకాశాల్ని కూడా వదులుకున్నాను. ఈ సినిమా కోసమే హార్స్‌ రైడింగ్‌ నేర్చుకున్నాను. అంతేకాదు నాకు అసలు పొగ అంటే పడదు. కానీ పాత్ర కోసం బీడీలు కాల్చాను.డైరెక్టర్ గారు ఏదోలా మేనేజ్ చేసేద్దామని అన్నారు. కానీ నాకు అలా చేయడానికి మనసొప్పలేదు. బీడీ తాగడం నేర్చుకొని ఆ సన్నివేశంలో నిజమైన బీడీనే తాగాను.బీడీ తాగినన్ని రోజులు భోజనం చేయాలంటే వాంతు వచ్చేది. అయినా ఆ పాత్రకి పూర్తి న్యాయం చేశాననే ఫీలింగ్ నాకు సంతృప్తినిచ్చేది. అందుకే నా పాత్ర సరిగ్గా రావడం కోసం ఎంతైనా కష్టపడతాను'' అంటూ చెప్పుకొచ్చింది. ఇదిలావుండగా కావల్సినంత గ్లామర్ ఉన్నా, ఎక్కడో మిస్సవుతుందే టాక్ జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో సోషల్‌మీడియా వైపు దృష్టి పెట్టింది.. అభిమానులను పోగోసుకుంది.నిత్యం వాళ్లతో టచ్‌లో ఉంటూ రకరకాల ఫోటోషూట్లను షేర్ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: