టాలీవుడ్‌ స్టార్‌ హీరో అల్లు అర్జున్ పై ఉన్న కేసును ఈ రోజు కొట్టివేసింది ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర హై కోర్టు. అల్లు అర్జున్ పిటిషన్ పై నేడు తీర్పు వెలువడింది ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర హై కోర్టు. ఎన్నికల సమయంలో ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని నంద్యాల పోలీసులు హీరో అల్లు అర్జున్ పై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేశాడు. అతనితో పాటు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ నేడు హైకోర్టులో తీర్పు ఇచ్చారు.


అల్లు అర్జున్ పై ఉన్న కేసును ఈరోజు కొట్టేశారు. అంతకుముందు ఎఫ్ఐఆర్ ఆధారంగా తదుపరి చర్యలు నిలుపుదల చేస్తూ ఆదేశాలు ఇచ్చిన హైకోర్టు ఇప్పుడు తాజాగా కేసును కొట్టివేసింది. ఈ తరుణంలోనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వార్నింగ్ ఇస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల సమయంలో...  వైసీపీ పార్టీ అభ్యర్థికి అల్లు అర్జున్‌ సపోర్ట్‌ గా ఉంటే.. మెగా కుటుంబం ట్రోలింగ్‌ చేసిందని.. ఇప్పుడు గుర్తు చేస్తూ.. పవన్‌ కళ్యాణ్‌ ను ట్రోల్‌ చేస్తున్నారు.


ఇక అటు అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి నేడు తన స్నేహితులతో కలిసి తిరుమల వెళ్ళింది. నిన్న రాత్రి నడకదారిలో అలిపిరి నుంచి తిరుమల చేరుకుంది.  నేడు ఉదయం వెంకటేశ్వర స్వామిని సుప్రభాత సేవలో దర్శించుకుంది. అల్లు స్నేహారెడ్డితో పాటు ఆమె స్నేహితులు కూడా దర్శించుకున్నారు. ఇక దర్శనానంతరం ఆలయం నుంచి బయటకు రాగానే అక్కడ మీడియా వారు ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు.


ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం జరిగింది. ఇదిలా ఉండగా....స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమా కోసం ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ స్టైల్, మేనరిజం, సినిమా మేకింగ్ అద్భుతంగా డిజైన్ చేశారు. ఈ సినిమా కోసం ప్రతి ఒక్క సినీ అభిమాని ఎంతగానో ఎదురు చూస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: