ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు ఎన్టీఆర్‌తో కలిసి సుబ్బు మూవీలో కీలక పాత్ర పోషించిన సోనాలి జోషి తన కొత్త లుక్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. 2001లో విడుదలైన 'సుబ్బు' సినిమాలో ఎన్టీఆర్‌తో కలిసి నటించింది సోనాలి జోషి. 'స్టూడెంట్ నెంబర్ 1' సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత వచ్చిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాటలు కూడా బాగా ఆకట్టుకున్నప్పటికీ, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా ఆడలేదు. ప్రేక్షకులు కొంత నిరాశ చెందారు. అయినా, సినిమాలోని పాటలు మాత్రం చాలా మందికి నచ్చాయి.
'సుబ్బు' సినిమా ఫ్లాప్ అయిన తర్వాత సోనాలి జోషికి తెలుగు సినిమాల్లో పెద్దగా అవకాశాలు దక్కలేదు. 'నాన్న నేను అబద్ధం', 'రాంబాబు గాడి పెళ్ళాం' వంటి కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ, ఆమెకు కావాల్సిన గుర్తింపు రాలేదు. దీంతో ఆమె సినిమాల్లోకి దూరం అయ్యారు. 'సుబ్బు' సినిమాలో ఎన్టీఆర్‌తో కలిసి నటించిన సోనాలి జోషి ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 'సుబ్బు' సినిమాలో నటించినప్పుడు ఆమె ఎలా ఉండేదో అలా ఇప్పుడు లేనేలేదు. ఇప్పుడు ఆమె మారిన తీరు చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఆమె ఎంతగా మారిపోయిందో అని అభిమానులు షాక్ అవుతున్నారు.