సింహా మూవీ బాలయ్యలోని మరో కోణాన్ని పరిచయం చేసిన సినిమా అని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. పరిమిత బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా నిర్మాతలకు మంచి లాభాలను అందించిందనే సంగతి తెలిసిందే. సింహా సినిమా కలెక్షన్ల విషయంలో సైతం అదరగొట్టిందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. మాస్ రోల్స్ లో, పవర్ ఫుల్ రోల్స్ లో బాలయ్య అదరగొట్టారనే చెప్పాలి.
సింహా సినిమా సక్సెస్ తర్వాత బాలయ్య మార్కెట్ పెరగడంతో పాటు బాలయ్య కెరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ బ్యానర్లు అన్నీ బాలయ్యతో సినిమాలను తెరకెక్కించడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. సింహా సినిమాకు సీక్వెల్ రావాలని ఫ్యాన్స్ భావిస్తున్నా ఈ సీక్వెల్ వచ్చే అవకాశాలు అయితే లేవని చెప్పవచ్చు.
బాలయ్య ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో వీరమాస్ సినిమాలో నటిస్తుండగా ఈ నెల 15వ తేదీన టైటిల్ టీజర్ రిలీజ్ కానుందని భోగట్టా. బాలయ్య బాబీ కాంబో బాక్సాఫీస్ ను షేక్ చేసే కాంబో అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. బాలయ్య రెమ్యునరేషన్ లో సైతం టాప్ లో ఉండగా బాలయ్య బాబీ కాంబో మూవీ డిజిటల్ హక్కులు నెట్ ఫ్లిక్స్ సొంతమయ్యాయి. స్టార్ హీరో బాలయ్య రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.