స్టార్ హీరో రామ్ చరణ్ తన సినీ కెరీర్ లో ఇప్పటివరకు డ్యూయల్ రోల్ లో నటించి విడుదలైన సినిమా నాయక్ మాత్రమే అనే సంగతి తెలిసిందే. గేమ్ ఛేంజర్ సినిమాలో సైతం చరణ్ డ్యూయల్ రోల్ లో నటించినా ఈ సినిమా థియేటర్లలో విడుదల కాలేదు. నాయక్ లో డ్యూయల్ రోల్ లో నటించి రామ్ చరణ్ నట విశ్వరూపం చూపించారనే చెప్పాలి. నాయక్ సినిమా కలెక్షన్ల విషయంలో సైతం అదరగొట్టింది.
 
వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా 2013 సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో చరణ్ కామెడీ టైమింగ్ సైతం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని చెప్పవచ్చు. రామ్ చరణ్ రెమ్యునరేషన్ ప్రస్తుతం భారీ స్థాయిలో ఉంది. రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ రిలీజ్ కు మరో రెండు నెలల సమయం మాత్రమే ఉందనే సంగతి తెలిసిందే.
 
గేమ్ ఛేంజర్ మూవీ టీజర్ కు ఏకంగా 45 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. గేమ్ ఛేంజర్ టీజర్ వ్యూస్ విషయంలో ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తున్నారు. గేమ్ ఛేంజర్ పాన్ ఇండియా మూవీగా ఇతర భాషల్లో సైతం విడుదల కానుందనే సంగతి తెలిసిందే. గేమ్ ఛేంజర్ టాలీవుడ్ బెస్ట్ సినిమాలలో ఒకటిగా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. గేమ్ ఛేంజర్ పై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
 
గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్ చరణ్ మళ్లీ డ్యూయల్ రో లో నటిస్తుండగా ఈ సినిమా తుది ఫలితం ఏ విధంగా ఉంటుందో చూడాల్సి ఉంది. రామ్ చరణ్ కెరీర్ ను భారీ స్థాయిలో ప్లాన్ చేసుకుంటుండగా చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీపై సైతం అంచనాలు పెరుగుతున్నాయి. చరణ్ బుచ్చిబాబు కాంబో టాలీవుడ్ ఇండస్ట్రీలోని బెస్ట్ కాంబోలలో ఒకటి అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: