ఈ సినిమాలో శ్రీ లీల ఐటమ్ సాంగ్ చేయబోతుంది. దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది . అఫీషియల్ ప్రకటన రాకముందే కొన్ని గంటల ముందు ఒక క్రేజీ పిక్ సోషల్ మీడియాలో లీకై బాగా వైరల్ గా మారింది . కాగా శ్రీ లీలను బన్నీతో ఓ రేంజ్ లో ఊపేసే విధంగా ఈ పాటలో స్టెప్స్ వేయించబోతున్నాడు సుకుమార్ అంటూ బాగా ప్రచారం జరుగుతుంది. ఇండస్ట్రీలోకి వచ్చిన చాలా తక్కువ టైం గ్యాప్ లోనే ఇలాంటి డెసీషన్ తీసుకోవడం సంచలనం గా మారింది.
అప్పుడే ఐటెం సాంగ్ ఒప్పుకోవడం పట్ల ఫ్యాన్స్ కూడా కొంచెం అసహనం వ్యక్తం చేస్తున్నారు . అయితే పుష్ప2 సినిమాలో కంటే ముందే ఓ స్టార్ హీరో సినిమాలో శ్రీలీల ఐటమ్ సాంగ్ చేసే ఆఫర్ వచ్చిందట . ఆ మూవీ మరేంటో కాదు "మాచర్ల నియోజకవర్గం". నితిన్ హీరోగా కృత్తి శెట్టి హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో శ్రీ లీలను ఐటమ్ సాంగ్ చేయాలి అంటూ డైరెక్టర్ ఆఫర్ చేశారట. కానీ ఆమె సున్నితంగా రిజెక్ట్ చేసిందట . ఆ తర్వాత ఆ పాటలో అంజలి మెరిసి మెప్పించింది . రారా రెడ్డి అంటూ ఈ పాట ఊపేసింది. పుష్ప2 ఐటమ్ సాంగ్ చేయడానికి శ్రీలీల ఒప్పుకోవడంతో మరొకసారి ఈ వార్త హైలెట్గా మారింది.
కాగా శ్రీ లీల -బన్ని కాంబో కోసం ఫాన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు . అయితే వీళ్ళిద్దరూ సినిమాలో హీరో హీరోయిన్లు గా కనిపిస్తే బాగుంటుంది అని అనుకున్నారు తప్పిస్తే ..ఎక్కడా కూడా శ్రీ లీల ఐటమ్ సాంగ్ చేయాలి ..అసలు చేస్తుంది అని కూడా ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు . ఎవరు తీసుకొని నిర్ణయం తీసుకుని సినిమా ఇండస్ట్రీని షేక్ చేసి పడేస్తుంది శ్రీలీల..!