టాలీవుడ్ లో గడచిన కొన్నేళ్ల క్రితం స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన సమంత. ఈ మధ్యకాలంలో తెలుగు సినిమా పరిశ్రమలో సినిమాలలో నటించడం లేదు. ఎక్కువగా హాలీవుడ్, బాలీవుడ్ వైపుగాని అడుగులు వేయడానికే పలు రకాల ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా సమంత ఇటీవలే సీటాడేల్ వెబ్ సిరీస్ అయిన హనీ బన్నీ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి పర్వాలేదనిపించుకుంది. అయితే ఈ వెబ్ సిరీస్ లో సమంత తల్లి పాత్రలో నటించిందట. దీంతో ఇటీవలె సమంత ఒక ఇంటర్వ్యూలో పలు విషయాలను తెలియజేసింది.


ముఖ్యంగా తనకు తల్లి కావాలని కలలు చాలా ఉన్నాయని అమ్మగా ఉండడానికి తాను ఇష్టపడతానని అందుకు ఎంత ఆలస్యమైనా తాను పట్టించుకోనని ప్రస్తుతం తాను జీవితంలో ఎంతో ఆనందంగా ఉన్నానని తెలిపింది సమంత. ఇటీవల హనీ బన్నీ వెబ్ సిరీస్ సమంతకి కూతురుగా నటించిన కస్వి మంజ్మదర్ నటించింది. ఇందులో ఇమే తెలివైన అమ్మాయిగా అద్భుతమైన హవ భావాలను సైతం పండించింది. అందుకే సమంత ఇలా తల్లి కావడం పైన ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.


గతంలో సమంత తాను రెండో వివాహం చేసుకోవలసిన అవసరం లేదని చెప్పినప్పటికీ కానీ సమంత ఇప్పుడు చేసిన ఈ వ్యాఖ్యలను చూసి అభిమానులు కచ్చితంగా సమంత రెండో వివాహాన్ని త్వరలోనే ప్రకటించబోతుందంటూ తెలియజేస్తున్నారు. తెలుగులో చివరిగా విజయ్ దేవరకొండ తో కలిసి ఖుషి చిత్రంలో నటించింది ఈ సినిమా కూడా బాగానే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ అని రాబట్టినట్లు తెలుస్తోంది. యంగ్ హీరోయిన్స్ సైతం దీటుగా పోటీ రావడంతో సమంత కి సైతం ఈ మధ్య అవకాశాలు తగ్గాయని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. హీరోయిన్లకు మించి గ్లామర్ పాత్రలలో నటిస్తూ.. లిప్ లాక్ సన్నివేశాలలో నటిస్తూ మరి ముందుకు వెళ్తోంది సమంత.. మరి రాబోయే రోజుల్లో మరిన్ని చిత్రాలలో నటిస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: