తెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ కలిగిన కాంబినేషన్లో నిఖిల్ , సుధీర్ వర్మ కాంబినేషన్ ఒకటి. వీరి కాంబోలో మొదటగా స్వామి రారా అనే సినిమా వచ్చింది. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా కంటే ముందు నిఖిల్ కెరియర్ వరుస అపజయలతో డీలా పడిపోయి ఉంది. అలాంటి సమయంలో నిఖిల్ కి ఈ సినిమా విజయం అద్భుతమైన జోష్ ను తీసుకువచ్చింది. ఈ మూవీ తర్వాత ఆయన కథల ఎంపిక విధానం కూడా చాలా వరకు మారింది.

సినిమా తర్వాత ఎన్నో విజయాలను అందుకొని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటుడుగా నిఖిల్ కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే స్వామి రారా సినిమా తర్వాత నిఖిల్ , సుధీర్ వర్మ కాంబోలో కేశవ అనే మూవీ వచ్చింది. ఈ సినిమా మంచి అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయింది. కానీ భారీ విజయాన్ని అందుకోలేదు. ఈ సినిమాకు విమర్శకుల నుండి ప్రశంసలు దక్కాయి. ఇకపోతే తాజాగా వీరి కాంబోలో అప్పుడు ఇప్పుడు ఎప్పుడో అనే సినిమా రూపొందింది. ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదల అయింది. ఈ మూవీ ఏ మాత్రం అంచనాలు లేకుండా థియేటర్లలో విడుదల అయింది. విడుదల తర్వాత కూడా ఈ సినిమాకు గొప్ప టాక్ రాకపోవడంతో ప్రస్తుతం చెప్పుకోదగ్గ కలెక్షన్లు కూడా ఈ సినిమాకి రావడం లేదు అని తెలుస్తుంది.

ఇకపోతే ఈ సినిమాను మేకర్స్ దాదాపు పది కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించినట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు 7 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. దానితో ఈ మూవీ 7.5 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్ లను వసూలు చేస్తే హిట్ స్టేటస్ ను అందుకొనుంది. కానీ ప్రస్తుతం మాత్రం ఈ సినిమాకు అన్ని కోట్ల కలెక్షన్లు వచ్చే అవకాశం లేదు అనే అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: