సోషల్ మీడియాలో వచ్చిన నెగిటివిటీని ఎన్టీఆర్, ఆయన అభిమానులు సైతం తన భుజాల మీద మోసి మరి దేవర చిత్రాన్ని సక్సెస్ అందుకున్నారు. కానీ ఓటీటీ లోకి వచ్చిన తర్వాత దేవర సినిమా అసంతృప్తి చూసిన ప్రేక్షకులలో కనిపిస్తోందట. ఎన్టీఆర్ అభిమానులు కూడా ఈ సినిమా ఆశించిన స్థాయిలో అయితే లేదని క్లైమాక్స్ తేలిపోయిందని సెకండ్ పార్ట్ కు ఇచ్చిన లీడ్ సరిగ్గా లేదనే విధంగా వార్తలు వినిపించాయి. అందుకే దేవర-2 పట్ల ఫ్యాన్స్ సంతృప్తిగా లేరనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఒకవేళ ఇదే తరహాలో దేవర-2 కూడా ఉంటే ఆడడం కష్టమని అందుకే సీక్వెల్ తీయాలా వద్దా అని అభిప్రాయం గురించి చిత్ర బృందం ఆలోచిస్తున్నట్లు సమాచారం. మొదట సీక్వెల్ అనౌన్స్మెంట్ చేసినప్పటికీ.. వాస్తవానికి మొదటి భాగం ఫెయిల్యూర్ అయితే రెండో భాగం ఆపి వేస్తారు.. కానీ దేవర సినిమా థియేటర్లో సక్సెస్ఫుల్గా అనిపించుకున్నది ఓటీటీ లో ఆకట్టుకోలేకపోవడంతో ఇప్పుడు మేకర్స్ పార్ట్-2 ఇయ్యాల వద్ద అనే సందిగ్ధంలో పడినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయం విన్న అభిమానుల సైతం కాస్త నిరాశలో ఉన్నట్లు తెలియజేస్తున్నారు. దేవర-2 కోసం కొరటాల శివ ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి తీయాలి అంటే తెలియజేస్తున్నారు. మరి అసలు విషయం ఏంటన్నది చిత్రబృందం తెలియజేస్తుందేమో చూడాలి.