టాలీవుడ్ లో నిన్నటి వరకు నైజాం వరకు డిస్ట్రిబ్యూషన్ అంటే కేవలం ఇద్దరి మధ్య మాత్రమే పోటీ ఉండేది. ఒకరు దిల్ రాజు .. రెండోది ఏషియన్ సునీల్. వీరిద్దరూ ఏం చెబితే అది వేదం అన్నట్టుగా ఉండేది. వీరిద్దరి మధ్య ప్రధానంగా పోటీ ఉన్న ఒక్కసారి వీరిద్దరూ తమ అవసరాల కోసం తెరవెనక చేతులు కలుపుతారు .. అయితే నీకు లేకపోతే నాకు అన్నట్టుగా వ్యవహరిస్తారు అన్న గుసగుసలు కూడా నిన్నటి వరకు టాలీవుడ్ లో ఉన్నాయి. ఎప్పుడు అయితే నైజాం పంపిణీ రంగంలోకి మైత్రి మూవీస్ ఎంటర్ అయిందో అందులోనూ ఈ ఏడాది సంక్రాంతికి హనుమాన్ సినిమా విజయవంతంగా పంపిణీ చేసిందో ... గత ఏడాది సంక్రాంతికి రెండు సొంత సినిమాలు అందులోనూ ఇద్దరు పెద్ద హీరోలు అయినా చిరంజీవి వాల్తేరు వీరయ్య - బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమాలో పంపిణీ చేయడం రెండు సూపర్ హిట్ అవ్వటం పైగా రెండు తమ బ్యానర్లో తెరకెక్కిన సొంత సినిమాలు కావటం .. ఇటు హనుమాన్ కని విని ఎరగని రేంజ్ లో పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్బస్టర్ హిట్ కావడంతో మైత్రి మూవీస్ కు తిరుగు లేకుండా పోయింది.


ఇప్పుడు మైత్రీ వాళ్ల‌ను అంద‌రు న‌మ్ముతున్నారు.. వాళ్ల వెంట ప‌డుతున్నారు. దీంతో తమిళంలో పెద్ద హీరోలు తెర‌కెక్కించిన డబ్బింగ్ సినిమాలు కూడా ఇప్పుడు నైజం లో మైత్రి మూవీస్ విజయవంతంగా పంపిణీ చేస్తుంది.. ఇప్పుడు అస‌లు లెక్కలు బయటకు వస్తున్నాయి. నిన్నటి వరకు నిజమైన కలెక్షన్లు బయటకు వచ్చేవి కావు.. అవి ఎప్పుడైతే బయటకు రావటం మొదలు పెట్టాయో చాలామంది మైత్రి మూవీస్ వెంట పడటం మొదలుపెట్టారు .తమ సినిమాలను మైత్రి మూవీస్ కి ఇచ్చి పంపిణీ చేయాలని చూస్తున్నారు. పైగా డిసెంబర్ 5న ఆ సంస్థ నిర్మించిన పుష్ప 2 లాంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమా రిలీజ్ అవుతుంది.


నిన్నటి వరకు టాలీవుడ్ లో నైజాం డిస్ట్రిబ్యూషన్ అంటే దిల్ రాజు వర్సెస్ ఏషియన్ సునీల్ గా ఉన్న పోటీ ఇప్పుడు మైత్రి శశి ఎంటర్ కావడంతో మూడు ముక్కలాటగా మారింది. ఏది ఏమైనా ఇప్పుడు టాలీవుడ్ లో నైజాం డిస్ట్రిబ్యూషన్ అసలు మ‌జా చూపిస్తుంది. ఇలా ఎక్కువ మంది మధ్య పోటీ ఉన్నప్పుడు అది ఆరోగ్యకరమైన పోటీ ఉండడంతో పాటు చిన్న చిన్న వాళ్లకు న్యాయం జరుగుతుంది. ఎప్పుడు కూడా గుత్తాధిపత్యం అనేది నియంత్రత్వానికి కారణమవుతోంది. ఇప్పుడు మైత్రి శశి ఎంట్రీ తో టాలీవుడ్ నైజాం డిస్ట్రిబ్యూషన్ లో ఒక ఆరోగ్యకరమైన పోటీ నెలకొందన్న చర్చలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: