అల్లు అర్జున్ హీరోగా నటించిన సెన్సేషనల్ సినిమా 'పుష్ప 2'. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు బద్దలు కొడుతూ దూసుకుపోతుంది.నాలుగు రోజుల మొదటి వీకెండ్ ముగిసేసరికి ఏకంగా రూ.829 కోట్లు వసూలు చేసింది. ఈ విషయాన్ని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఇండియన్ సినిమా హిస్టరీలోనే మొదటి వీకెండ్లో ఒక సినిమా ఇంత వసూళ్లు సాధించడం ఇదే మొదటిసారి. ఇదిలావుండగా ఈ చిత్రంలో హైలైట్ గా నిలిచిన క్రేజీ సన్నివేశాల్లో క్లైమాక్స్ సీక్వెన్స్ రప్పా రప్పా యాక్షన్ బ్లాక్ కూడా ఒకటి.అల్లు అర్జున్ అమ్మవారి రూపంలో విశ్వరూపం ప్రదర్శించిన ఈ సన్నివేశం సినిమాలో బిగ్గెస్ట్ హైలైట్స్ లో ఒకటిగా నిలిచింది. ఐతే ఈ చిత్రంలో కీలక యాక్షన్ అండ్ ఎమోషనల్ బ్లాక్ లు అన్నీ ఒక్క అమ్మాయి చుట్టూనే తిరుగుతాయి. అంతా ఎంతో ఎదురు చూసిన జాతర సన్నివేశం కానీ.. ఇపుడు క్లైమాక్స్ లో చూపించిన రప్పా రప్పా సీన్ కానీ సినిమాలో పుష్ప రాజ్ కూతురు వరుస అయ్యిన అమ్మాయి కోసమే కనిపిస్తాయి.ఈ క్రమంలో పుష్ప 2కి ముందనుకున్న క్లైమాక్స్ అది కాదంటూ టాక్ నడుస్తుంది.క్లైమాక్స్ వేరేగా అనుకున్నారట. కానీ.. సమయానుకూలంగా కథకు తగ్గట్టుగా మెల్లమెల్లగా సన్నివేశాలను మారుస్తూ క్లైమాక్స్ ను పూర్తిగా మార్చేసారని తెలుస్తుంది. అంతేకాదు.. పుష్ప 2 కోసం.. ఏకంగా మూడు సీన్స్ అనుకున్నా లాస్ట్‌లో అవేవి వర్కౌట్ కాలేదని.. దాంతో మొత్తం క్లైమ్యాక్స్ మార్చేశాడని సమాచారం. 

నిజానికి సినిమాలో మెయిన్ విలన్ భన్వర్‌ సింగ్ షేకావత్ ఉన్నాడు. భన్వర్ సింగ్ షేకావత్‌ చనిపోయిన తర్వాత దాక్షాయని, మంగళం సీను కూడా కామ్ అయిపోతారు. ఇక పుష్పరాజ్ సిండికేట్ హెడ్గా కొనసాగుతాడు. దీంతో ఎండ్ కార్డు పడాలని క్లైమాక్స్ ప్లాన్ చేసుకున్నాడట సుకుమార్.అది చేయలేదు. ఇక సినిమాలో చూపించినట్లు పుష్ప రాజ్‌కి ఇంటి పేరు వచ్చేలా.. కానీ వేరే ఫైట్ సీన్ తో ఇది జరిగేలా క్లైమాక్స్ ను భావించారట. అయితే అది కూడా కాకుండా మరో విధంగా క్లైమాక్స్ ను ఎండ్ చేశారు. మరొకటి భన్వర్ సింగ్ షెకావత్‌ పుష్పపై కోపంతో పుష్పని చంపకుండా.. పుష్ప చేసే సంగ్లింగ్ ను ఆపేస్తూ.. చేసే ఒక్క దాడిలో శ్రీవల్లి చనిపోవడం.. అప్పటికే శ్రీవల్లి ప్రెగ్నెంట్ అయి ఉండటంతో ఆ కోపంతో బన్నీ.. షెకావత్ పై పగ తీర్చుకోవాలని చూడటం.. కానీ రెడ్ హ్యాండెడ్ గా పుష్పరాజ్ దొరికిపోయి అక్కడ నుంచి తప్పించుకొని అడవుల్లోకి పారిపోయేలా క్లైమాక్స్ అనుకున్నారు. అయితే ఈ మూడు కూడా పుష్ప 2 సినిమాలో చూపించలేదు సుకుమార్ .ఇదిలావుండగా ఇప్పటికే రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం 1000 కోట్లకి పైగా వసూళ్లు అందుకుంటుంది అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: