అయితే ఇదే సినిమాని అటు బాలీవుడ్ లో కబీర్ సింగ్ అనే పేరుతో రీమేక్ చేయగా అక్కడ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించగలిగాడు సందీప్ రెడ్డి. సందీప్ టేకింగ్ కి బాలీవుడ్ గడ్డపై కూడా ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇక రణబీర్ కపూర్ ను హీరోగా పెట్టి యానిమల్ అనే సినిమా తీశాడు. ఇక ఈ సినిమా కూడా సూపర్ డూపర్ విజయాన్ని సాధించింది. కేవలం బాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లోనూ ఇక వసూళ్ల సునామీ సృష్టించి నిర్మాతలకు లాభాల పంట పండించింది. ఈ సినిమాకు పార్ట్-2 కూడా ఉంటుంది అని ఇప్పటికే సందీప్ రెడ్డి వంగ చెప్పేసాడు. దీంతో పార్ట్ 2 పై భారీగానే అంచనాలు ఉన్నాయి.
ఇలా సెన్సేషనల్ విజయాన్ని సాధించిన యానిమల్స్ సినిమాకు అసలు డైరెక్టర్ సందీప్ ఎన్ని పార్ట్ లు ప్లాన్ చేశాడు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే ఈ విషయంపై హీరో రణబీర్ కపూర్ అసలు విషయం చెప్పేసాడు. యానిమల్ మూవీ రెండో పార్ట్ షూటింగ్ 2027లో ప్రారంభం కాబోతుంది అంటూ చెప్పుకొచ్చాడు. రణబీర్ కపూర్ ప్రస్తుతం సందీప్ వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు అంటూ తెలిపాడు. యానిమల్ పార్ట్ 3 కూడా ఉంటుంది అంటూ రణబీర్ అభిమానులకు కిక్ ఇచ్చి న్యూస్ చెప్పాడు. రెండో పార్ట్ లో హీరో - విలన్ మధ్య ఎంతో ఆసక్తికర సన్నివేశాలు ఉంటాయి అంటూ తెలిపాడు. కాగా పార్ట్ 2 కి యానిమల్ పార్క్ టైటిల్ ని ఫిక్స్ చేశారు అన్న విషయం తెలిసిందే.