మంచు ఫ్యామిలీ అనే భారీ బ్యాగ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ.. ఇద్దరు సక్సెస్ కాలేకపోయారు. సరైన స్టార్ డమ్ మాత్రం సొంత చేసుకోలేకపోయారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు వరకు మంచు ఫ్యామిలీలోని హీరోలందరూ అంటే ఇద్దరు కొడుకులు తండ్రి కలిసి ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు. ఇక ఈ సినిమాలు పెద్దగా విజయం సాధించిన సందర్భాలు కూడా లేవు. అది సరేగాని ఇప్పుడు మంచు ఫ్యామిలీ గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది అనేదే కదా డౌట్. ఎప్పుడు ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలిచే మంచు ఫ్యామిలీ ఇటీవలే ఫ్యామిలీ గొడవలతో వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది.
మోహన్ బాబు మంచు మనోజ్ల మధ్య గొడవ జరిగిందని.. ఏకంగా మంచు మనోజ్ ని మోహన్ బాబు కొట్టారని.. ఇక ఆసుపత్రికి వెళ్తే తీవ్రమైన గాయాలు కూడా బయటపడ్డాయి అంటూ వార్తలు ఇండస్ట్రీలో సంచలనంగా మారిపోయాయి. ఇలాంటి సమయంలో వారి గురించి ఏ విషయం తెర మీదకి వచ్చినా అది హాట్ టాపిక్ గా మారిపోతుంది. వాస్తవానికి మంచు మనోజ్ విష్ణు అన్నదమ్ములు అన్న విషయం తెలిసిందే. కానీ ఇల్లు తోడబుట్టిన అన్నదమ్ములు కాదట. అంటే వీరిద్దరూ తండ్రి ఒక్కరే అయినప్పటికీ తల్లి మాత్రం వేరు. మంచు మోహన్ బాబు విద్యా దేవి అనే యువతిను వివాహం చేసుకున్నాడు. వీరికి మంచు లక్ష్మి, విష్ణు పుట్టారు. ఇక ఆ తర్వాత విద్యాదేవి అనారోగ్యంతో చనిపోవడంతో ఆమె చెల్లెలు నిర్మల దేవుని పెళ్లి చేసుకున్నాడు మోహన్ బాబు. నిర్మల దేవి మంచు మోహన్ బాబు కి పుట్టిన సంతానమే మంచు మనోజ్ ఇలా మంచు విష్ణు మనోజ్ లు అన్నదమ్ములు అని తెలిసినప్పటికీ తోడబుట్టిన అన్నదమ్ములు మాత్రం కాదు. ఇద్దరికీ తల్లులు మాత్రం వేరు కావడం గమనార్హం .