మాస్ రాజా రవితేజ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన రవితేజ , ఆ తర్వాత క్యారెక్టర్ ఆరిస్టుగా మారి పలు సినిమాల్లో నటించారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన 'నీకోసం' సినిమాతో హీరోగా అవతారం ఎత్తిన రవితేజ, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం సినిమాతో సక్సెస్ ఫుల్ హీరోగా మారారు. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరో స్థాయికి రవితేజ ఎదిగారు. గతంలో రవితేజ పలు హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించారు, తర్వాత ఆ హీరోలే రవితేజ సినిమాల్లో క్యారెక్టర్ ఆరిస్టులుగా నటించారు.అందరి హీరోల అభిమానులు రవితేజను అభిమానిస్తుంటారు. ఇప్పటికి కూడా యంగ్ హీరోలకు రవితేజ గట్టి పోటీనిస్తున్నారు. ఇదిలా ఉంటేయాక్టర్ల అన్న తర్వాత అన్ని రకాల పాత్రలు చేయాలి. నేను ఆ పాత్రలో మాత్రమే కనిపిస్తానంటూ గిరి గీసుకుని కూర్చుంటే ఇక్కడ అవకాశాలు దక్కవు. అయితే ఓ సినిమాలో హీరో పక్కన హీరోయిన్‌గా నటించిన ఓ భామ, అదే హీరో లవర్‌గా, వదినగా కూడా నటించడం అంటే సాధారణ విషయం కాదు. అలా నటించింది మరెవ్వరో కాదు.. రవితేజ-శృతి హాసన్. వీరిద్దరు కలిసి మూడు సినిమాల్లో నటించారు. బలుపు, క్రాక్, వాల్తేరు వీరయ్య. ఈ మూడు సినిమాల్లో కూడా రవితేజ-శృతి హాసన్ మూడు రకాలుగా కనిపించారు.బలుపు సినిమాలో రవితేజకు లవర్‌గా కనిపించిన శృతి హాసన్, క్రాక్ సినిమాతో రవితేజకు భార్యగా కనిపించారు. చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ ఆయన తమ్ముడు పాత్రలో కనిపించారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతి హాసన్ నటించారు. అంటే రవితేజకు వదిన అవుతారన్న మాట. ఇలా మూడు సినిమాల్లో మూడు ప్రత్యేక పాత్రల్లో శృతి హాసన్ కనిపించి అలరించారు. విచిత్రం ఏమిటంటే ఈ మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను నమోదు చేశాయి.ఇదిలావుండగా శ్రుతి హాసన్ చివరిసారిగా సలార్ చిత్రంలో కనిపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: