ఈ మధ్య కాలంలో మన తెలుగు హీరోలు హిందీ ప్రేక్షకులను ఫుల్ గా టార్గెట్ చేస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. బాహుబలి సినిమా హిందీ లో విడుదల అయ్యి అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వాసులు చేసింది. దాని తర్వాత ప్రభాస్ నటించిన చాలా సినిమాలు హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్లను కొల్లగొట్టాయి. ఇక రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ సినిమా కూడా హిందీలో కలెక్షన్లను బాగానే రాబట్టింది. ఈ సినిమా ద్వారా రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ కి హిందీ లో మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే పుష్ప పార్ట్ 1 మూవీ తో హిందీ మార్కెట్లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 2 మూవీ తో కూడా హిందీలో అద్భుతమైన కలెక్షన్లను రాబడుతున్నాడు.

ఇకపోతే టాలీవుడ్ స్టార్ హీరోలు అయినటువంటి ప్రభాస్ , రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ , అల్లు అర్జున్ ఇప్పటికే తమ తమ సినిమాలతో హిందీ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఇకపోతే రామ్ పోతినేని వీరందరి కంటే ముందు స్థాయిలోనే ఉన్నాడు. అది ఎలా అనుకుంటున్నారా ..? కొన్ని సంవత్సరాల క్రితం రామ్ "నేను శైలజ" అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో కీర్తి సురేష్ హీరోయిన్గా నటించింది.

మూవీ తెలుగులో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమా హిందీ డబ్బింగ్ వర్షన్ కి యూట్యూబ్ లో 630 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇప్పటివరకు ఏ తెలుగు డబ్బింగ్ సినిమా కూడా ఇన్ని మిలియన్ వ్యూస్ ను  యూట్యూబ్ లో అందుకోలేదు. అలా తెలుగు డబ్బింగ్ సినిమాలలో హిందీ వర్షన్ లో అత్యధిక వ్యూస్ సాధించిన సినిమాలలో నేను శైలజ మొదటి స్థానంలో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: