తెలుగు సినీ పరిశ్రమలో చారిత్రాత్మక కథాంశం వచ్చిన సినిమాలన్ని దాదాపుగా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని చవిచూశాయి. . ఈ వరుసలో వచ్చిన ఆనాటి మల్టీ స్టారర్ హిస్టారికల్ మూవీ 'బొబ్బిలి యుద్ధం'
సినిమా డిసెంబర్ 4వ తేదీన 1964 సంవత్సరంలో విడుదలైన ఘన విజయం సాధించింది.
వెండితెరపై ఎన్టీఆర్, ఎస్విఆర్, భానుమతి, జమున, సీతారాం గార్లు వైవిధ్యభరితమైన పాత్రోచితంగా నటించి ఆనాటి బొబ్బిలి రాజవంశీయుల విజయనగర రాజ్య ఆధిపత్య సంఘటనా సమాహారం వెండితెరపై చూడవచ్చు.


ఈ సినిమాలో పాత్ర‌ధారుల‌ను చూస్తే... .  రాజరంగ రాయలు ఎన్టీఆర్ - పట్టపు రాణిగా భానుమతి అమ్మ -
తాండ్ర పాపారాయుడుగా ఎస్విఆర్ - విజయరామరాజు గా రాజనాల - యువరాణి సుభద్రగా జమునమ్మ -
వేంగళర్రాయుడుగా సీతారాం -  సాలూరి వారి సంగీతం - ఘంటసాల, సుశీల గార్ల గానం - సముద్రాల, ఆరుద్ర, శ్రీశ్రీ, సినారె, కొసరాజు గార్ల గీత సాహిత్యం  - శ్రీ సముద్రాల రాఘవాచార్య స్వామి, గబ్బిట వేంకట్రావు గార్ల సందర్భోచిత సంభాషణలు ఇవ‌న్నీ సినిమాను సూప‌ర్ హిట్ చేశాయి. .


ఎన్టీఆర్, భానుమతి గార్లు కాంబినేషన్ సన్నివేశలు నటించాలంటే ఒకందుకు కత్తి మీద సాము లాంటిదే...
తాండ్ర పాపారాయుడు పాత్రలో ఎస్విరంగారావు సెట్లోకి మేకప్ వేసుకుని వచ్చాడంటే అంద‌రికి హ‌డ‌ల్‌. జమున రోమాంటిక్ సీన్స్ లో మెరుపు తీగల సహజ సౌందర్యంతో లావణ్యంతో రాచరిక రాజకుమారిగా సీతారాం గారిని డామినేట్ చేసేలా ఉంది. ఎన్టీఆర్ - భానుమతి మొదలైన అగ్రశ్రేణి కళాకారులను ఒక్క చోట చేర్చి నటింపచేసి 'బొబ్బిలి యుద్ధం' సినిమాను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసిన సీతారాం పాత్ర‌ను కూడా ఈ సినిమా విజ‌యం లో త‌క్కువ చేయ‌లేం. ..  సంగీత మహోపాధ్యాయ, స్వర, రాగ సార్వభౌమ శ్రీ సాలూరి రాజేశ్వరరావు సంగీతం కూడా సినిమాకు హైలెట్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: