కొన్ని సంవత్సరాల క్రితం తమిళ నటుడు కార్తీ "ఖైదీ" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ తమిళ్ లో విడుదల అయినప్పటికీ తెలుగు లో మాత్రం పెద్దగా అంచనాలు లేకుండా విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమా రెండు ప్రాంతాల్లో కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ద్వారా కార్తీ క్రేజ్ ఫుల్ గా పెరగగా లోకేష్ కనకరాజు కు ఈ మూవీ ద్వారా మంచి గుర్తింపు లభించింది. ఇక ఈ సినిమా చివరలో ఈ మూవీ కి కొనసాగింపుగా ఖైదీ 2 ఉండబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

కానీ ఇప్పటివరకు ఈ మూవీ కి సంబంధించిన సీక్వెల్ ప్రారంభం కాలేదు. ఇక ఓ వైపు కార్తీ , మరో వైపు లోకేష్ కనకరాజు మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమాకు సంబంధించిన సీక్వెల్ ప్రారంభం కాబోతుంది అని చాలా సార్లు చెప్పారు. కానీ ఈ మూవీ సీక్వెల్ మాత్రం ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. ఇకపోతే సూపర్ స్టార్ రజినీ కాంత్ కొంత కాలం క్రితం జైలర్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా అదిరిపోయే రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో ఈ మూవీ విడుదల అయిన కొంత కాలానికి ఈ మూవీ కి కొనసాగింపుగా సీక్వెల్ ఉండబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

అయినా కూడా ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన సీక్వెల్ ప్రారంభం కాలేదు. ఈ మూవీ సీక్వెల్ అప్పుడు ప్రారంభం కానుంది ... ఇప్పుడు ప్రారంభం కానుంది అని వార్తలు వస్తున్నాయి కానీ ఈ సీక్వెల్ మాత్రం ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. ఇలా తమిళ బ్లాక్ బాస్టర్స్ అయినటువంటి ఖైదీ , జైలర్ మూవీ సీక్వెల్స్ కి సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి కానీ ఈ సినిమాలు మాత్రం స్టార్ట్ కావడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: