ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా పుష్ప పార్ట్ 2 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి రష్మిక మందన హీరోయిన్గా నటించగా ... టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మైత్రి సంస్థ వారు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఇకపోతే ఈ సినిమాను డిసెంబర్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు.

మూవీ కి సంబంధించిన ప్రీమియర్ షో లను డిసెంబర్ 4 వ తేదీ రాత్రి నుండి ప్రదర్శించడం మొదలు పెట్టారు. ఈ మూవీ ప్రీమియర్ షో లకి మంచి టాక్ రావడంతో ఈ సినిమాకు ఆ తర్వాత నుండి సూపర్ సాలిడ్ కలెక్షన్లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కుతున్నాయి. ఇకపోతే ఈ సినిమా ఏకంగా 3 గంటల 20 నిమిషాల 38 సెకండ్ల నిడివితో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదట ఈ సినిమా రన్  టైమ్ చూసి ఈ మూవీ అద్భుతంగా ఉంటే తప్ప ప్రేక్షకులను ఆకట్టుకోలేదు అని అభిప్రాయాలను కొంత మంది జనాలు వ్యక్తం చేశారు. కానీ ఈ సినిమా రన్ టైమ్ ఎక్కువ ఉన్నా కానీ ఈ మూవీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మొదట ఈ సినిమాకు సంబంధించిన ఎడిటింగ్ మొత్తం పూర్తి అయ్యాక ఈ మూవీ రన్ టైమ్ నాలుగు గంటల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. కానీ ఆ తర్వాత ఈ సినిమాలో కొన్ని అనవసరపు సన్నివేశాలను తీసివేసినట్లు దానితో 40 నిమిషాల రన్ టైమ్ తగ్గినట్లు చివరగా ఈ సినిమాను 3 గంటల 20 నిమిషాల 38 సెకండ్ల నిడివితో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: