టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఇక తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా , నిర్మాతగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో కళ్యాణ్ రామ్ ఒకరు. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ అన్నదమ్ములు అన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ మధ్య కాలంలో కళ్యాణ్ రామ్ నిర్మాణ సంస్థలో జూనియర్ ఎన్టీఆర్ వరుస పెట్టి సినిమాలు చేస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే కళ్యాణ్ రామ్ కెరియర్ బిగినింగ్ లోనే జూనియర్ ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన సినిమాలో కళ్యాణ్ రామ్ నటించాడట. ఇక ఆ సినిమా ఏకంగా అద్భుతమైన విజయాన్ని అందుకొని కళ్యాణ్ రామ్ కి గొప్ప పేరును తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది. మరి జూనియర్ ఎన్టీఆర్ రేజాక్ట్ చేసిన ఏ సినిమాలో కళ్యాణ్ రామ్ నటించాడు అనే వివరాలను తెలుసుకుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం కళ్యాణ్ రామ్ అతనొక్కడే అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందె. ఈ సినిమాతోనే కళ్యాణ్ రామ్ వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ కి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ కి మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే మొదట ఈ సినిమా కథ కళ్యాణ్ రామ్ వద్దకు కాకుండా తారక్ వద్దకు వచ్చిందట. కథ మొత్తం విన్న తారక్ ఈ సినిమాను కొన్ని కారణాల వల్ల రిజెక్ట్ చేశాడట. ఇక ఆ తర్వాత ఈ కథను సురేందర్ రెడ్డి z కళ్యాణ్ రామ్ కి వినిపించగా ఆ సినిమా ఆయన చేయడం , ఆ మూవీ అద్భుతమైన విజయం సాధించడం జరిగిందట. అలా తారక్ రిజెక్ట్ చేసిన కథతో కళ్యాణ్ రామ్ బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: