అయితే గతంలో బాలయ్య వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన ఒక్క మగాడు సినిమా ఊహించిన విధంగా డిజాస్టర్ గా మిగిలింది .. ఈ సినిమాతో బాలయ్య క్రేజ్ ఒక్కసారిగా పాతాళానికి వెళ్లిందని కూడా చెప్పాలి . అలాంటి సమయంలోనే బోయపాటి వచ్చి బాలయ్య సినీ కెరియర్ను ఊహించని మలుపు తిప్పాడు . గతంలో బాలయ్య నటించిన సినిమాలు మంచి విజయాలు సాధించినప్పటికీ ఒక్క మగాడు సినిమా కారణంగా ఆయనకి అంతకుముందు వచ్చిన క్రేజ్ మొత్తం పోయిందనే చెప్పవచ్చు .. ఆ సినిమా తర్వాత బోయపాటి దర్శకత్వంలో సింహ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఇక అప్పటి నుంచి బాలయ్య క్రెజ్ పెరుగుతూ వెళ్ళింది .. అలాగే బాలయ్య , బోయపాటి కాంబో అంటే ప్రేక్షకుల్లో ఊహించని క్రేజ్ నెలకొంది ..
అయితే గతంలో బాలయ్య ఒక్క మగాడు సినిమా రిలీజ్ అయిన సమయంలో .. రవితేజ కృష్ణ సినిమా కూడా ప్రేక్షకులు ముందుకు వచ్చి బంపర్ హిట్ అయింది .. రవితేజ , ఒక్క మగాడు సినిమాకు మాత్రమే కాకుండా తర్వాత బాలకృష్ణ నటించిన మిత్రుడు సినిమాకు పోటిగా కిక్ సినిమాను రిలీజ్ చేసి మరో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు . ఆ తర్వాత మరోసారి రవితేజ సంక్రాంతికి మిరపకాయ సినిమాతో వస్తే బాలకృష్ణ పర్మవీరచక్ర తో వచ్చి డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు .. ఇలా తన కెరీర్ లో మూడుసార్లు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడగా నాలుగోసారి బాలకృష్ణ పై చేయి సాధించాడు .. రీసెంట్గా భగవంత్ కేసరి సినిమాతో బాలకృష్ణ బాక్సాఫీస్ భారీలోకి దిగగా రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్లాఫ్ ను తన ఖాతాలో వేసుకున్నాడు .. బాలకృష్ణ భగవంత్ కేసరితో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు . అయితే ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న డాకు మహారాజ్ సినిమాలో రవితేజ కీలకపాత్రలో నటిస్తున్నారని టాక్ కూడా వినిపిస్తుంది . మరి సంక్రాంతికి వస్తున్న ఈ సినిమాతో బాలయ్య ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి .