2000వ దశకంలో బుల్లితెర అభిమానులను ఎంతగానో మెప్పించిన అమృతం సీరియల్ లో రమ రాజమౌళి కొన్ని ఎపిసోడ్లో నటించారు .. ఓ ఎపిసోడ్లో న్యూస్ రీడర్‌గా వార్తలు చదువుతూ కనిపించారు .. అలాగే మరో ఎపిసోడ్లో హౌస్ వైఫ్ గా గుండు హనుమంతరావుతో కలిసి నటించారు . అమృతం సీరియల్ ప్రొడ్యూసర్ కం రైటర్ గుణ్ణం గంగరాజు రమ రాజమౌళికి దగ్గర బంధువు అవుతారు .. ఆ బంధుత్వం తోనే అమృతం సీరియల్లో రమ రాజమౌళి నటించారు .. ఆ తర్వాత మళ్లీ ఆమె స్క్రీన్ పై ఎక్కడా కనిపించలేదు . ఇదే క్రమంలో రమ రాజమౌళితో పాటు అమృతం సీరియల్ లో నటించిన పలువురు నటీనటులు .. పనిచేసిన టెక్నీషియన్లు ప్రస్తుతం ఎవరు ఊహించని పొజిషన్లో ఉండటం గమనార్హం ..
అమృతం సీరియల్‌కు సినిమాటోగ్రాఫర్ గా సెంథిల్‌కుమార్ పనిచేశారు .. ఈ సీరియల్ తోనే కెమెరామెన్ గా ఇండస్ట్రీకి పరిచయమైన సెంథిల్‌కుమార్ .. మగధీర , బాహుబలి , త్రిబుల్ ఆర్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు సినిమా ఆటోగ్రాఫర్ గా పనిచేశారు. ఇదే క్రమంలో అమృతం సీరియల్ లోని పలు ఎపిసోడ్స్ టాలీవుడ్ దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం కూడా వహించారు .. ప్రజెంట్ టాలీవుడ్ లో టాప్ కమెడియన్ గా కొనసాగుతున్న సత్య అమృతం సీరియల్‌కు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయడం విశేషం .. ఒక ఎపిసోడ్లో ఆర్టిస్ట్ గా కూడా సత్య కనిపించాడు .. శ్రీనివాస్ రెడ్డి తో పాటు మరికొందరు కమెడియన్లు ఈ సీరియల్లో చిన్న చిన్న పాత్రలు పోషించి ఇప్పుడు అగ్ర కమెడియన్లు గా దూసుకుపోతున్నారు .