టాలీవుడ్ ఇండస్ట్రీలో... చాలా రకాల సీక్వెల్ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో సీక్వెల్ గా వచ్చిన కొన్ని సినిమాల్లో సక్సెస్ అయితే కొన్ని సినిమాలు మాత్రం పెద్దగా ఆడలేదు. కానీ కొన్ని సినిమాలు బంపర్ హిట్ కొట్టాయి.  పుష్ప 2, బాహుబలి 2 లాంటి పెద్ద సినిమాలు తప్ప చిన్న చిన్న సీక్వెల్ అన్ని అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. కొన్ని యావరేజ్ గా హిట్ అయ్యాయి. మరికొన్ని సినిమాలు.. నిర్మాతలకు నష్టాలను తీసుకువచ్చాయి.

 అలాంటి వాటిలో రక్త చరిత్ర 2 సినిమా ఒకటి. రక్త చరిత్ర సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దివంగత మాజీ మంత్రి పరిటాల రవి జీవిత కథ నేపథ్యాన్ని రాంగోపాల్ వర్మ చాలా చక్కగా తీర్చిదిద్దారు. అయితే ఈ సినిమా సక్సెస్ కావడంతో రక్త చరిత్ర 2 కూడా తీశారు రాంగోపాల్ వర్మ. అయితే ఈ సినిమా మాత్రం బెడిసి కొట్టింది. పరిటాల రవీంద్ర... జీవిత కథ ఆధారంగా 2010లో రక్త చరిత్ర 2 సినిమాను రిలీజ్ చేశారు వర్మ.

 వాస్తవంగా ఈ కథను అందించింది ప్రశాంత్ పాండే. రక్త చరిత్ర సంచలనం సృష్టించడంతో పార్ట్ 2 కూడా తీశారు. కానీ జనాలకు ఈ సినిమా పెద్దగా నచ్చలేదు. ఈ సినిమాలో వివేక్ ఒబెరాయి, రాధిక ఆప్టే, ప్రియమణి, సూర్య అలాగే శత్రుజ్ఞ  సింహా లాంటి నటీనటులు కీలకపాత్రలో మెరిశారు. ఇక ఈ సినిమాకు మధు మంతెన, సీతల్ వినోద్ తల్వార్, మరో ఇద్దరు  నిర్మాతలుగా వ్యవహరించారు.

 ఇక ఈ సినిమాకు 19 కోట్ల వరకు  బడ్జెట్ ఖర్చు అయింది.  పెద్ద నటీనటులు ఉండడంతో ఖర్చు విపరీతంగా పెరిగింది. ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేసినప్పటికీ... కలెక్షన్స్ పెద్దగా రాలేదు. కేవలం 3.44 కోట్లు రావడం జరిగింది. దీంతో బాక్సాఫీస్ ముందు రక్త చరిత్ర  2 డిజాస్టర్ గా మిగిలిందని చెప్పవచ్చు. ఇక నిర్మాతల బృందం నిరాశకు గురైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: