టాలీవుడ్ లోని బిగ్ ఫ్యామిలీస్ లో మెగా ఫ్యామిలీ ఒకటి.. మెగా ఫ్యామిలీకి అభిమానుల సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది.. చిరంజీవి సపోర్ట్ తో ఇండస్ట్రీకి పరిచయం అయిన మెగా హీరోలు మంచి సక్సెలు సాధిస్తున్నారు.. మెగా ఫ్యామిలో మెగాస్టార్ చిరంజీవి తరువాత అంతటి రేంజ్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న వ్యక్తి పవన్ కల్యాణ్.. ఫ్యాన్స్ లో పవన్ క్రేజ్ పీక్స్ లో ఉంటుంది.. పది సంవత్సరాలు హిట్ లేకపోయినా కూడా ఫ్యాన్స్ లో పవన్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.. అంతటి క్రేజ్ వున్న స్టార్ హీరో పవన్ కల్యాణ్.. మెగాస్టార్ సపోర్ట్ ఎదిగిన మరో స్టార్ హీరో అల్లు అర్జున్..మావయ్య సపోర్ట్ తో హీరోగా ఎదిగిన అల్లు అర్జున్ తనదైన టాలెంట్ తో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.. డాన్స్ లో, ఫైట్స్ లో, యాక్టింగ్ లో ఇలా ప్రతీ దాంట్లో ఎంతో హార్డ్ వర్క్ చేసి ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్నాడు అల్లుఅర్జున్.అయితే పవన్ కల్యాణ్ సినిమాలు చేస్తూనే రాజకీయాలలోకి వెళ్లి సొంత పార్టీని స్థాపించారు.. ఆ పార్టీని నడిపిస్తూనే ఇటు సినిమాలు సైతం చేస్తూ వచ్చారు.

గత ఎన్నికలలో బిజెపీ, టీడీపీ తో పొత్తు పెట్టుకున్న పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొన్నారు.. అయితే ఎంతో కస్టపడి కెరీర్ నిలబెట్టుకున్న అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యారు..కానీ తన ప్రతీ సినిమా ఫంక్షన్ లో ఫ్యాన్స్ పవన్ కల్యాణ్ అంటూ నినాదాలు చేస్తూ ఆయన గురించి చెప్పాలని గొడవ చేసేవారు.. పవన్ గురించి చెప్పడం బన్నీకి పెద్ద కష్టమేమి కాదు.. ఇలా పవన్ కల్యాణ్ గురించి మాట్లాడితే సినిమా గురించి ఎవరూ పట్టించుకోరు.. న్యూస్ పేపర్ లో హెడ్ లైన్స్ కూడా పవన్ ని పొగిడిన బన్నీ అని వేస్తారు. సినిమాను ఎవరూ పట్టించుకోరాని పవన్ గురించి చెప్పను బ్రదర్ అంటూ అప్పట్లో అల్లుఅర్జున్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. ఇదిలా ఉంటే ఎన్నికలలో పోటీ చేస్తున్న పవన్ కల్యాణ్ కి సపోర్ట్ ఇచ్చి తన స్నేహితుడు పవన్ ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి అయిన శిల్పా రవికి బన్నీ కాంపెయినింగ్ చేయడంతో మెగాస్ ఫ్యాన్స్ కి బన్నీ పై కోపం తెప్పించింది.. అప్పటి నుండి మెగా ఫ్యాన్స్ అంతా బన్నీ ని నిందించడం మొదలు పెట్టారు.. ఇక నుంచి బన్నీ సినిమాలకు మెగా సపోర్ట్ ఉండదని స్పష్టం చేసారు.. రీసెంట్ గా విడుదల అయిన పుష్ప 2 కి సైతం మెగా ఫ్యాన్స్ సపోర్ట్ ఇవ్వలేదు.. అయినా కూడా బన్నీ పాన్ ఇండియా స్టార్ కావడంతో పుష్ప 2 సినిమా అద్భుత విజయం సాధించింది..

మరింత సమాచారం తెలుసుకోండి: