ప్రస్తుతం మంచు ఫ్యామిలీ కి సంబంధించిన గొడవలు ఇండస్ట్రీలో ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో చెప్పనక్కర్లేదు.ముఖ్యంగా మనోజ్ కుటుంబానికి పూర్తిగా వ్యతిరేకమయ్యారు. మోహన్ బాబు విష్ణు ఒకవైపు ఉంటే మనోజ్ ఒకవైపు అయ్యారు. ఇక ఈ విషయంలో మనోజ్ తల్లి కూడా ఏమి మాట్లాడలేని పరిస్థితి నెలకొంది. ఇక లక్ష్మి కూడా ఈ విషయంలో తలదూర్చడం లేదని తెలుస్తోంది. ఇక ఈ గొడవలు తీవ్రమై కొట్టుకునే వరకు వస్తున్నాయి.అయితే ఇదంతా పక్కన పెడితే మంచు ఫ్యామిలీలో ఇదొక్క వివాదమే కాదు గతంలో ఎన్నో వివాదాలు జరిగాయి.మోహన్ బాబు చిరంజీవి అవార్డు తీసుకునే సమయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వంటివి ఎన్నో ఉన్నాయి. ఇక అప్పట్లో మోహన్ బాబు చేసిన మరో తప్పు ఏంటంటే..తన కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి నుండి దూరం చేయడం.మరి ఇంతకీ ఆయన ఎవరు.. ఎందుకు కూతురు జీవితం నాశనం చేశారు అనేది ఇప్పుడూ చూద్దాం..

 మంచు లక్ష్మి తన భాషతో ఎన్నో ట్రోల్స్ ఎదుర్కొంటుంది. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ అవ్వాలి అనుకుంది. కానీ అది వర్కవుట్ అవ్వలేదు. అలా కొన్ని సినిమాల్లో కీలకపాత్రల్లో కూడా నటించింది. అయితే అలాంటి మంచు లక్ష్మి ప్రస్తుతం సినిమా ఆఫర్ల కోసం ముంబైకి వెళ్ళింది.అంతేకాదు పొట్టి బట్టలు వేసుకుంటూ అసలు మంచు మోహన్ బాబు కూతురేనా.. ఆయన పరువు మొత్తం తీస్తుందే అనేలా తయారయింది.ఎందుకంటే ఈమె గతంలో ఏనాడు లేని విధంగా పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది.ఇక మంచు లక్ష్మికి ఒక కూతురు కూడా ఉంది. ఇక ఎవరికి తెలియని విషయం ఏమిటంటే.. లక్ష్మికి అది రెండో పెళ్లి..ఎందుకంటే మొదట లక్ష్మి శ్రీనివాస్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.అయితే రెండో భర్త పేరు కూడా శ్రీనివాస్ అయినప్పటికీ మొదట ఆమె చదువుకునే సమయంలో శ్రీనివాస్ అనే వ్యక్తిని గాఢంగా ప్రేమించి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో లేచిపోయి పెళ్లి చేసుకుంది. అయితే ఈ విషయం తెలిసి మోహన్ బాబు ఇంట్లో గొడవ గొడవ చేశారట.
అంతేకాదు కొద్ది రోజులైతే అంతా కుదుటపడుతుంది అనుకునే సమయంలో మోహన్ బాబు ఎలాగైనా తన కూతుర్ని శ్రీనివాస విడదీయాలని శ్రీనివాస్ కి ఏ పని దొరకకుండా తన పలుకుబడి ఉపయోగించుకొని చేశారట. దాంతోమంచు  లక్ష్మి ఇంటికి వెళ్లి ఏదో ఒక విషయం తేల్చుకుంటానని మోహన్ బాబు ఇంటికి వెళ్లగా.. ఆగ్రహించిన మోహన్ బాబు ఇష్టం లేని పెళ్లి చేసుకొని మా పరువు అంతా తీసావ్..నువ్వు నోరెత్తకు.. ఇంట్లోనే పడి ఉండు..

అంటూ రూమ్లో వేసి లాక్ చేశారట. ఆ తర్వాత చిత్రహింసలు పెట్టిన మోహన్ బాబు మొదటి భర్తతో విడిపోయేలా నిర్ణయం తీసుకునేలా చేశారట.అయితే మంచు లక్ష్మిని మోహన్ బాబు టార్చర్ చేశారు అనే విషయాన్ని మంచు లక్ష్మి మొదటి భర్త శ్రీనివాస్ మీడియా సమావేశంలో చెప్పారు. తన భార్యని దారుణంగా కొట్టి హింసిస్తున్నాడని, అందరి ముందు పరువు పోతుందని పెళ్లికి నామమాత్రంగా ఒప్పుకున్నప్పటికీ ఆ తర్వాత మాత్రం మా పెళ్లి చేసిన వారందరినీ వేధిస్తున్నాడు. మళ్లీ నా భార్యని నా దగ్గరికి పంపుతారనే నమ్మకంతో మీ అందరికీ ఈ విషయాన్ని చెబుతున్నాను అంటూ మీడియా ముందు తన ఆవేదన వ్యక్తం చేశారు మంచు లక్ష్మి మొదటి భర్త . ఇక లక్ష్మీ కూడా తన తండ్రి పలుకుబడి చూసి ఎన్నటికున్నా మేమిద్దరం కలిసి బతకలేము అని భయపడిందో ఏమో తెలియదు కానీ మొదటి భర్తకు విడాకులు ఇచ్చేసిందట.ఆ తర్వాత ఈ విషయం మర్చిపోవడానికి మంచు లక్ష్మిని విదేశాలకు పంపించారు మోహన్ బాబు.ఇక విదేశాలకు పంపాక అక్కడ కూడా లక్ష్మి శ్రీనివాస్ అనే మరో వ్యక్తి ప్రేమలో పడింది.ఈ విషయం తెలుసుకున్న మోహన్ బాబు ఆయన బ్యాగ్రౌండ్ తెలుసుకొని ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయని గ్రహించి ఇండియాకి తీసుకువచ్చి ఇద్దరికీ గ్రాండ్ గా పెళ్లి చేశారు. అలా మోహన్ బాబు మంచు లక్ష్మి ప్రేమించి పెళ్లి చేసుకున్న అబ్బాయి నుండి విడదీసి చివరికి తాను అనుకున్నదే సాధించాడు

మరింత సమాచారం తెలుసుకోండి: