మంచు ఫామిలీ గురించి తెలుగు జనాలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కుటుంబం సినిమాలకంటే వివాదాల వలెనే ఎక్కువ ఫేమస్ అయ్యిందని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు! ఓపెన్ గా చెప్పుకోవాలంటే ఒక్క మోహన్ బాబు తప్పితే, తన వారసులు ఎవరు కూడా సినిమాలలో పెద్దగా సక్సెస్ అయ్యింది లేదు. మంచు మనోజ్ మొదట మూడు నాలుగు సినిమాల వరకు పర్వాలేదు అనిపించినా, కాలానుక్రమంలో అతను కూడా పెద్ద సక్సెస్ కాలేదనే చెప్పుకోవాలి. ఇక మంచు మోహన్ బాబు పెద్ద కుమారుడు విష్ణు గురించి చెప్పాల్సిన పనిలేదు. ఒకటి అరా సినిమాలు తప్పితే విష్ణు సినిమాలు పెద్దగా ఆడిన దాఖలాలు లేవు. ఆ సంగతి పక్కన బెడితే మంచు వారి ఫామిలీ సోషల్ మీడియాలో అనునిత్యం ఏదో ఒక విషయమై ట్రోల్ అవుతూనే ఉంటుంది.

ఎక్కువగా ప్రేక్షకులు మోహన్ బాబు, విష్ణు, లక్ష్మిని టార్గెట్ చేస్తూనే కామెంట్స్ చేస్తూ ఉంటారు. మనోజ్ దీనికి మినహాయింపు అని చెప్పుకోవచ్చు. అయితే ఏమయ్యిందో తెలియదు కానీ గత కొన్నాళ్లుగా మనోజ్ కి, మోహన్ బాబుకి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఇక ఇక్కడ విష్ణు, తండ్రి మోహన్ బాబుకి మద్దతుగా ఉంటాడనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు! అయితే వీరిమధ్య గొడవలు చినికి చినికి గాలివానలా మారి, నేడు తారాస్థాయికి చేరుకున్నాయి. అయితే అప్పుడప్పుడు వీరిమధ్య సంధి నెరిపి గొడవలు సద్దుమణిగేలా చేసేవారు మంచు లక్ష్మి. కానీ ఇపుడు మంచు కుటుంబంలో ఏర్పడిన వివాదానికి మంచులక్ష్మి దూరంగా ఉన్నట్టు సమాచారం. చాలా రోజుల కిందటే ఆమె ముంబైకి మకాం మార్చారని వార్తలు వినిపిస్తున్నాయి.

అవును, ఇపుడు మంచు లక్ష్మి లోకం పూర్తిగా మారిపోయింది. అయితే తండ్రి, కొడుకుల మధ్య ఘర్షణ జరిగినట్లుగా ఆదివారం ప్రచారం జరగడంతో సోమవారం ముంబై నుంచి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో తండ్రి, సోదరుడితో మాట్లాడారు. కానీ ఎవరూ తగ్గే పరిస్థితి కనబడకపోవడంతో వెంటనే ఫ్లైట్ ఎక్కి ముంబై చెక్కేసినట్టు తెలుస్తోంది. కనీసం ఫిల్మ్ నగర్ లోని తన నివాసానికి కూడా వెళ్లలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు బైబై హైదరాబాద్ అని సోషల్ మీడియాలో స్టేటస్ కూడా పెట్టుకున్నారు. ఈ తరుణంలో మంచు ఫాన్స్ కొంతమంది మంచు లక్ష్మిని కలుగజేసుకొని కుటుంబ గొడవ బజారున పడకుండా జేయమని సోషల్ మీడియా వేదికగా వేడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: