తెలుగు సినిమా పరిశ్రమలో దసరా పండుగ వచ్చింది అంటే అనేక సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. అందులో భాగంగా వచ్చే సంవత్సరం దసరా పండగ కోసం ఇప్పటి నుండి పోటీ మొదలయ్యింది. ఇప్పటికే వచ్చే సంవత్సరం దసరా పండుగకు మూడు క్రేజీ సినిమాలు రావడానికి రెడీ అయ్యాయి. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనలు కూడా వచ్చేసాయి. మరి వచ్చే సంవత్సరం దసరా పండుగ కు పోటీ పడబోయే ఆ మూడు సినిమాలు ఏవి అనే వివరాలను తెలుసుకుందాం.

నందమూరి నట సింహం బాలకృష్ణ కొన్ని సంవత్సరాల క్రితం అఖండ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ప్రగ్య జైస్వాల్మూవీ లో హీరోయిన్ గా నటించింది. మూవీ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాకు కొనసాగింపుగా అఖండ 2 అనే మూవీ ని తెరకెక్కించబోతున్నారు. ఈ మూవీ యొక్క షూటింగ్ కూడా మరికొన్ని రోజుల్లోనే స్టార్ట్ కాబోతోంది. ఈ సినిమాను వచ్చే సంవత్సరం దసరా పండుగ సందర్భంగా సెప్టెంబర్ 25 వ తేదీన విడుదల చేనున్నట్లు ఈ మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ లో కూడా ప్రగ్య జైస్వాల్మూవీ లో హీరోయిన్ గా నటించబోతునట్లు తెలుస్తుంది.

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరో గా రూపొందుతున్న సంబరాల ఏటిగట్టు సినిమాను సెప్టెంబర్ 25 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు.

రిషబ్ శెట్టి హీరో గా రూపొందుతున్న కాంతారా చాప్టర్ 1 సినిమాని అక్టోబర్ 2 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు చాలా రోజుల క్రితమే ప్రకటించారు.

ఇలా వచ్చే సంవత్సరం దసరా పండుగ సందర్భంగా ఈ మూడు సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: