రాయలసీమ ఫ్యాక్షనిజం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందించగా ఈ సినిమాలోని పాటలు అంచనాలకు మించి హిట్టయ్యాయి. సమరసింహారెడ్డి సినిమా రీరిలీజ్ అయ్యి రీరిలీజ్ లో సైతం అదిరిపోయే రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడం కొసమెరుపు. బాలయ్య సినిమాలలో మెజారిటీ సినిమాలు సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి.
2025 సంక్రాంతి కానుకగా డాకు మహారాజ్ మూవీ రిలీజ్ కానుండగా ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కుతున్న ఈ సినిమా రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. బాలయ్య సమరసింహారెడ్డి తరహా కాన్సెప్ట్ లలో నటించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బాలయ్య నెక్స్ట్ లెవెల్ సినిమాలను ఎంచుకుంటూ విజయాలను అందుకుంటున్నారు.
సమరసింహారెడ్డి సినిమాలో ట్విస్టులు ఆసక్తికరంగా ఉంటాయనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సిమ్రాన్ ఒక హీరోయిన్ గా నటించగా అంజలా ఝవేరి మరో హీరోయిన్ గా నటించడం గమనార్హం. బాలయ్య బి.గోపాల్ కాంబినేషన్ రిపీట్ అయితే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బాలయ్యను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండగా బాలయ్యకు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది. బాలయ్య ప్రస్తుతం విభిన్నమైన సినిమాలకు ఓటేస్తున్నారు. ఈ ఏడాది బాలయ్య సినిమలేవీ రిలీజ్ కాకపోయినా 2025 సంవత్సరంలో బాలయ్య నటించిన రెండు సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి.