గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన సినిమా 'గేమ్ చేంజర్'. పాన్ ఇండియా సినిమాగా విడుదల కాబోతున్న సినిమాకు శంకర్ దర్శకత్వం వహించారు.ఇటివల విడుదలైన టీజర్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన మూడు పాటలు అభిమానులను అలరించాయి. ఇప్పుడీ సినిమాపై చిత్ర యూనిట్ కొత్త ప్రోమో విడుదల చేసింది.'మరో ముప్పై రోజుల్లో గేమ్ చేంజర్ సందడి..' అంటూ కొత్త ప్రోమో విడుదల చేసింది. ప్రోమోలో కొత్త స్టిల్స్ అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. పొలిటికల్ థ్రిల్లర్ కావడంతో రామ్ చరణ్ స్టిల్స్ ఆకట్టుకుంటున్నాయి. సంక్రాంతికి జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా భారీగా సినిమాను విడుదల చేయనున్నారు.ఇక షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టనున్నారని టాక్.. ఇక తాజాగా ఓ న్యూస్ కూడా వినిపిస్తుంది.. తెలుగు చిత్ర పరిశ్రమలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ చిత్ర డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నాడు. అమెరికాలో ప్రీ-రిలీజ్ వేడుక జరుపుకోనుంది. భారీగా నిర్వహిస్తున్న ఈవెంట్ న డల్లాస్ లో నిర్వహిస్తున్నారు. ఇప్పటికే వేలల్లో బుకింగ్స్ జరిగాయి. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈవెంట్ కు అతిధిగా క్రియేటివిటీ డైరక్టర్ సుకుమార్ హాజరుకానున్నారు.

మరోవైపు సినిమా ప్రమోషన్లు భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఈనెల 21 అమెరికాలో జరిగే ప్రీ-రిలీజ్ వేడుకతో అమెరికాలో ప్రీ-రిలీజ్ జరుపుకుంటున్న తొలి భారతీయ సినిమాగా రికార్డులకెక్కనుంది. ఇప్పటకే టికెట్స్ భారీగా అమ్ముడైనట్టు తెలుస్తోంది. నాలుగో పాటను అక్కడే విడుదల చేయబోతున్నారుః. ముఖ్య అతిధి కూడా హాజరవుతున్నట్టు తెలుస్తోంది.ఇదిలావుండగా ఈ సినిమా కోసం అభిమానులు మాత్రమే కాకుండా ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. జనవరి 10వ తారీఖున విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కి, పాటలకు ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. వచ్చే వారం నుండి ప్రమోషనల్ కార్యక్రమాలు కూడా మొదలు కానున్నాయి. త్వరలోనే థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేయబోతున్నారు. రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ లండన్ లో మొదలయ్యాయి. నెల రోజులకు ముందే 6 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. రేపటి నుండి నార్త్ అమెరికా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు కాబోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: