స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చి వెబ్ సిరీస్ లతో తెగ బిజీ అయిపోయారు .. ఈమె ప్రవర్తన చూస్తుంటే ఇప్పట్లో తెలుగు వైపు చూసేలా , హైదరాబాద్‌కు వచ్చేలా ఎక్కడా కనిపించడం లేదు .. తన మక్కాం మొత్తం ముంబైలోనే పెట్టేసి అక్కడే ఉంటున్నారు సమంత .. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన పోస్టులు పెడుతూ ఉంటారు .. అయితే ఇప్పుడు సమంత తన ఇన్స్టా స్టోరీలో పెట్టిన ఒక పోస్ట్ తెగ వైరల్ అవుతుంది .. ఓ ఏడాది నువ్వు గెలవొచ్చు .. ఓ ఏడాది నీ కారెక్టర్ గెలవొచ్చు అంటూ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు సమంత . ఇక అక్కడితో ఆగకుండా 2025 ప్రొడక్షన్ కూడా ఇచ్చేశారు .. వచ్చే ఏడాది నువ్వు బిజీగా ఉండొచ్చు నీ వృత్తిలో అభివృద్ధితో పాటు డబ్బు సంపాదించుకోవచ్చు నమ్మకమైన ప్రేమించేవాడు రావచ్చు పిల్లలు కూడా నీ లైఫ్ లోకి రావచ్చు అంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది.
అయితే ఈ పోస్ట్ మూడు రాశులకు సంబంధించిన పోస్ట్ ఇది .. వృషభం , వృశ్చికం , కన్య రాశి .. వారిని ఉద్దేశిస్తూ ఈ పోస్ట్ చేశారు సమంత .. అందులో ప్రేమించేవాడు కావాలని పిల్లలు కూడా కావాలి అంటూ సమంత రాసుకోచ్చారు .. ఇక నాగచైతన్య - శోభిత పెళ్లి అయిన వారం రోజులు కాకముందే సమంత నుంచి ఈ పోస్ట్ రావటంతో సోషల్ మీడియాలో తెగ గాసిప్లు పుట్టుకొస్తున్నాయి .. ఇక మరి చూడాలి రాబోయే రోజుల్లో సమంత లైఫ్ లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో ..