చిత్ర పరిశ్రమ అంటేనే ఓ రంగుల ప్రపంచం .. ఇందులో సక్సెస్ అయితే ఎలాంటి వారికైనా అదిరిపోయే గుర్తింపు వస్తుంది .  ఎలాంటి బడా కంపెనీలో ఉద్యోగం చేసేవారైనా సినిమాల్లో అవకాశం వస్తే ఆ ఉద్యోగాలను వదిలేసి మరి సినిమాల్లోకి వచ్చి నటిస్తారు .. ఇప్పుడు చెప్పబోయే నటి కూడా గతంలో ఓ బడా కంపెనీలో ఉద్యోగం మానేసి సినిమాల్లోకి వచ్చి స్టార్ స్టేటస్ ని దక్కించుకుంది.. ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్ కు చెందిన ఈ ముద్దుగుమ్మ సినిమాల్లోకి రాకముందు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేసేది .. ఐటీ దిగ్గజ సంస్థల్లో ఒకటైన టిసిఎస్ లో కొన్నేళ్లపాటు జాబ్ చేసింది..


అయితే సినిమాలపై ఆస్తితో లక్షల జీతం వచ్చే జాబును వదిలేసుకుని చిత్రపరిశ్రమ లో అడుగు పెట్టింది . 2016 లో నాగార్జున హీరోగా వచ్చిన ఉపిరి సినిమాతో కెరియర్ మొదలు పెట్టింది పూజిత పొన్నాడ .. ఆ తర్వాత నాగచైతన్య ప్రేమమ్ సినిమాలో కూడా కాలేజ్ స్టూడెంట్ గా కనిపించింది . అయితే పూజితకు బాగా గుర్తింపు తీసుకొచ్చిన సినిమా ఏదంటే రంగస్థలం అని చెప్పాలి .. ఇందులో హీరో తమ్ముడు ఆది పినిశెట్టి ప్రియురాలు పద్మ పాత్ర లో ఆమె నటన అభినయం అందరిని ఆకట్టుకుంది .

 

ఇక ఆ తర్వాత రాజుగాడు , బ్రాండ్ బాబు , హ్యాపీ వెడ్డింగ్ , కల్కి , వేర్ ఈజ్ వెంకట లక్ష్మి , రన్ , మిస్ ఇండియా , కథ కంచికి మనం ఇంటికి , ఓదెల రైల్వే స్టేషన్ వంటి తదితర సినిమాలో నటించింది పూజిత . అలాగే రవితేజ హీరోగా వచ్చిన రావణాసుర సినిమాలో కూడా కీలకపాత్రలో కనిపించింది .. అయితే ఎందుకో గాని ఈ ముద్దుగుమ్మకు అన్ని సినిమాల్లో నటించినా క్రేజ్ మాత్రం సరిగ్గా రావటం లేదు . ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న హరిహర వీరమల్లు సినిమాలో పూజిత ఒకీలక పాత్రలో కనిపిస్తున్నట్టు తెలుస్తుంది .  అలాగే ఓ తమిళ సినిమాలో కూడా ఈమె నటిస్తుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: