పుష్ప టు సినిమా విడుదలైన సమయంలో సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి మృతి చెందిన కేసు లో అల్లు అర్జున్ ని తాజాగా అరెస్ట్ చేశారు పోలీసులు. ఈయన అరెస్ట్ అయిన కొద్ది నిమిషాలకే మీడియా మొత్తం వైరల్ గా మారింది. ఇక అల్లు అర్జున్ అరెస్టుతో ఆయన అభిమానులు అందరూ షాక్ అయిపోయారు. కుటుంబ సభ్యులు కూడా షాక్ లో మునిగిపోయారు. కనీసం తనని బట్టలు వేసుకోవడానికి కూడా అనుమతి ఇవ్వలేదని బట్టలు వేసుకోవడానికి వెళ్ళినా కూడా లోపల దాకా వచ్చారని పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు అల్లు అర్జున్. ఇక అల్లు అర్జున్ తో పోలీస్ స్టేషన్ కి వస్తానని కారు ఎక్కిన అల్లు అరవింద్ ని బన్నీ దించేసి భార్యకు, తండ్రికి ధైర్యం చెప్పి అక్కడి నుండి  పోలీసులతో గాంధీ హాస్పిటల్ కి వెళ్లారు. గాంధీ హాస్పిటల్ లో అల్లు అర్జున్ కి వైద్య పరీక్షలు నిర్వహించారు.

అల్లు అర్జున్ కి బిపి వంటి వైద్య పరీక్షలు చేస్తున్నారు.ఇప్పటికే బ్లడ్ షాంపిల్స్ కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక హాస్పిటల్ కి అల్లు అరవింద్ తో పాటు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా వచ్చారు. ఇక అల్లు అర్జున్ గాంధీ హాస్పిటల్ కి వచ్చారని తెలియడంతో గాంధీ హాస్పిటల్ చుట్టూ అల్లు అర్జున్ అభిమానులంతా గుమిగూడారు.ఇక అల్లు అర్జున్ కి వైద్య పరీక్షలు ముగియడంతోనే ఆయన్ని నాంపల్లి కోర్టుకి తరలిస్తారని తెలుస్తోంది.అయితే తాజాగా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారనే విషయం తెలుసుకున్న చిరంజీవి తన విశ్వంభరా షూటింగ్ ని రద్దు చేసుకొని మరీ అల్లు అర్జున్ ఇంటికి బయలు దేరాడట..

 కేవలం చిరంజీవి ఒక్కడే కాదు భార్య సురేఖతో కలిసి ఆయన అల్లు అర్జున్ ఇంటికి వెళ్లినట్టు తెలుస్తోంది.ఇక ఇంట్లో అల్లు అర్జున్ కుటుంబ సభ్యుల్ని కలిసి ఆ తర్వాత అల్లు అర్జున్ ఉండే పోలీస్ స్టేషన్ దగ్గరికి చిరంజీవి వెళతారని సమాచారం. కేవలం చిరంజీవి మాత్రమే కాదు నాగబాబు కూడా అల్లు అర్జున్ నివాసానికి బయలుదేరినట్లు తెలుస్తోంది.ఏది ఏమైనప్పటికీ అల్లు అర్జున్ అరెస్ట్ మాత్రం ప్రస్తుతం ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. చేయని తప్పుకు శిక్ష అనుభవించినట్లు అయింది

మరింత సమాచారం తెలుసుకోండి: