టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మృతి చెందింది. ఇక రేవతి మృతి చెందగా ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడగా పోలీసులు హాస్పటల్‌కు తరలించి కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే ఈ రోజు పోలీసులు ఈ రోజు బన్నీని అరెస్టు చేసేందుకు ఆయన ఇంటికి వెళ్లారు. అక్కడి అరెస్ట్ చేసి తీసుకువెళ్తుండగా.. బన్నీ తన వైఫ్తో మాట్లాడుతూ డల్ అయిపోయావెందుకు.. ధైర్యంగా ఉంటూ భార్య స్నేహారెడ్డిని ఓదారుస్తూ ధైర్యం చెప్పారు.
అలాగే పోలీసుల తీరుపై సార్ నేను మీరు ఎలా చెపితే అలా చేస్తాను.. నన్ను తీసుకు వెళ్లడం కూడా తప్పు కాదు.. కానీ బెడ్ రూంలోకి వచ్చేసి హడావిడి చేయడంతో పాటు అక్కడ నా బట్టలు మార్చుకునే అవకాశం లేకుండా.. కనీసం పర్మిషన్ ఇవ్వకుండా బిహేవ్ చేసింది నాకు నచ్చలేదు. ఇది మంచి విషయం కాదు అంటూ అల్లు అర్జున్ మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది.
బన్నీ కిందకు వచ్చిన వెంటనే స్నేహా కాఫీ తీసుకు వచ్చింది. ఆ కాఫీ తాగుతూ పోలీసుల తో మాట్లాడారు. కాఫీ తాగిన తర్వాత పోలీస్ జీప్ ఎక్కేందుకు వెళుతుండగా .. అక్కడ అల్లు అరవింద్ని చూసి ... డాడీ నువ్వెందుకు డాడీ ఇక్కడకు వచ్చావు .. నువ్వు వెళ్లిపో .. దీనిలో ఏ క్రెడిట్ వచ్చినా .. నాకే ఉండాలి ... గుడ్ అయినా.. బ్యాడ్ అయినా అంటూ ఆందోళన తో ఉన్న తన తండ్రిని ఓదార్చాడు. ఏదేమైనా బన్నీ చాలా స్మైలీ ష్ గానే ఈ కేసును ఎదుర్కోవాలని అనుకున్నట్టు గా ఉన్నాడు.