
మాస్ మహారాజా రవితేజ - శ్రీను వైట్ల కాంబినేషన్‌లో వచ్చిన సూపర్ డూపర్ హిట్ సినిమా వెంకీ. 2004 మార్చి 26న రిలీజ్ అయిన ఈ సినిమా ఈ ఏడాదితో 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. రవితేజ పోషించిన వెంకీ పాత్ర, హీరోయిన్ స్నేహ నటించిన శ్రావణి పాత్ర . .. ఎప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో చెక్కుచెదరని స్థానం సంపాదించుకున్నాయి. . దర్శకుడుగా అప్పటికే శ్రీను వైట్ల.. నీకోసం , సొంతం లాంటి సినిమాలు చేశారు.
శ్రీను వైట్లకు ఇది ఐదో సినిమా. . రవితేజ కాంబినేషన్‌లో ఆయనకు రెండో సినిమా. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమా కు స్వరాలు అందించారు. శ్రీనువైట్ల తన ప్రతి సినిమాకు నాగార్జున సాగర్‌కి వెళ్లి అక్కడే స్క్రిప్ట్ పనులు పూర్తిచేసే అలవాటును వెంకీ సినిమాతోనే మొదలుపెట్టారు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాకు మా టీం ఊహించిన దానికన్నా ఎక్కువ స్పందన లభించిందని ... వెంకీ సినిమా చాలా బాగుందని చిరంజీవి సార్ చెప్పటమే ఈ సినిమా విషయంలో నాకు నచ్చిన బెస్ట్ కాంప్లిమెంటరీ అని ఓ సందర్భం లో శ్రీను వైట్లు తెలిపారు. .
ఇక వెంకి సినిమాకు సీక్వెల్‌గా వెంకీ 2 తెరకెక్కించే ఆలోచన కూడా తనకు ఉందని శ్రీను వైట్ల చెప్పారు. వాస్తవానికి ముందుగా ఈ సినిమాలో స్నేహకు బదులుగా ఆసిన్‌ను హీరోయిన్గా అనుకున్నారు. . ఆ టైంలో ఆసిన్, నాగార్జున.. శివమణితో పాటు మరో సినిమా చేస్తూ ఉండటం.. వెంకీ సినిమాకు కాల్ షీట్లు ఇవ్వకపోవడంతో ఆమెకు బదులుగా స్నేహను తీసుకున్నారు. సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యాక ఒక్క సారి గా . రవితేజ మార్కెట్ పెరిగిపోయింది . .